తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు సోన్​భద్ర బాధితులను కలవనున్న సీఎం యోగి - ప్రియాంక గాంధీ

ఉత్తరప్రదేశ్​ సోన్​భద్రలో కాల్పుల ఘటన జరిగిన గ్రామాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ రోజు సందర్శించనున్నారు. మృతుల కుటుంబాలను ఆయన కలవనున్నారు.

నేడు సోన్​భద్ర బాధితులను కలవనున్న సీఎం యోగి

By

Published : Jul 21, 2019, 6:31 AM IST

Updated : Jul 21, 2019, 6:54 AM IST

ఉత్తరప్రదేశ్​లో సోన్​భద్ర జిల్లాలో జరిగిన కాల్పుల ఘటన రాజకీయ దుమారం చెలరేగింది. తాజా పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఈ రోజు ఘటన జరిగిన గ్రామాన్ని సందర్శించనున్నారు.

భూవివాదంలో జరిగిన కాల్పుల్లో మృతి చెందిన 10 మంది కుటుంబ సభ్యులను ఆయన కలవనున్నారు. ఘర్షణకు దారితీసిన కారణాలను బాధితులను అడిగి తెలుసుకొని వారికి భరోసా ఇవ్వనున్నారు.

ఈ ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 28 మందిని కూడా ఆదిత్యనాథ్ పరామర్శించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి: 'ప్రజల గుండెల్లో షీలా చిరస్థాయిగా నిలుస్తారు'

Last Updated : Jul 21, 2019, 6:54 AM IST

ABOUT THE AUTHOR

...view details