తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సోన్​భద్ర బాధితులకు 'సీఎం' పరామర్శ..

ఉత్తర్​ప్రదేశ్​ సోన్​భద్ర భూవివాద బాధిత కుటుంబాలు, క్షతగాత్రులను రాష్ట్ర ​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ పరామర్శించారు. ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని హామీనిచ్చారు. యోగి పర్యటనను స్వాగతించిన ప్రియాంక గాంధీ... కాంగ్రెస్​ పోరాటంతోనే ప్రభుత్వంలో కదలిక వచ్చిందని పేర్కొన్నారు.

సోన్​భద్ర బాధితులకు యోగి పరామర్శ

By

Published : Jul 21, 2019, 9:12 PM IST

ఉత్తర్​ప్రదేశ్‌ సోన్‌భద్రలో భూవివాద కాల్పుల బాధిత కుటుంబాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పరామర్శించారు. మృతుల కుటుంబాలు, క్షతగాత్రులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ నెల 15న ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన వారి ఆరోగ్య పరిస్ధితిని అడిగి తెలుసుకున్నారు. మృతి చెందిన 10 మంది కుటుంబాలతో పాటు ఇతర బాధితులను ఉద్దేశించి ప్రసంగించిన యోగి.. ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.


కాంగ్రెస్​ పోరాటంతోనే...

బాధిత కుటుంబాలను సీఎం పరామర్శించడాన్ని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్వాగతించారు. బాధితుల పక్షాన వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు​ పోరాడిన తర్వాతే ఉత్తరప్రదేశ్​ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎద్దేవా చేశారు. బాధితులకు అండగా నిలవటం ప్రభుత్వ బాధ్యతని ట్వీట్​ చేశారుప్రియాంక.

ప్రియాంక గాంధీ ట్వీట్​

" ఉంభా గ్రామ ప్రజలు న్యాయం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. వారి 5 డిమాండ్లను ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆశిస్తున్నా. బాధితులకు ఈ రోజు ఇచ్చిన హామీలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి."

- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి

ABOUT THE AUTHOR

...view details