తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'హైదరాబాద్​లో కాల్చిపడేశారు.. యూపీలో ఏం చేశారు?' - ప్రియాంకరెడ్డి నిందితుల ఎన్​కౌంటర్​

మహిళా భద్రతపై లోక్​సభలో ఈరోజు చర్చ వాడీవేడిగా సాగింది. ఉత్తరప్రదేశ్​ ఉన్నావ్​లో అత్యాచార బాధితురాలికి నిప్పంటించి హత్యాయత్నం చేయడాన్ని విపక్షాలు సభలో ప్రస్తావించాయి. హైదరాబాద్​ పోలీసులు అత్యాచార నిందితుల్ని ఎన్​కౌంటర్​ చేస్తే.. యూపీ పోలీసులు ఏం చేస్తున్నారని కాంగ్రెస్​ ప్రశ్నించింది.

Adhir Ranjan Chaudhary,Congress in Lok Sabha: On one hand there is a Lord Ram temple being built and on the other hand Sita Maiya is being set ablaze.
'హైదరాబాద్​లో కాల్చిపడేశారు.. యూపీలో ఏం చేశారు?'

By

Published : Dec 6, 2019, 1:05 PM IST

దిశ అత్యాచార నిందితుల్ని ఎన్​కౌంటర్​ చేసిన విషయం లోక్​సభలో ప్రస్తావనకు వచ్చింది. మహిళా భద్రతపై చర్చ సందర్భంగా కాంగ్రెస్​ పక్ష నేత అధీర్​ రంజన్​ చౌదరి ఆవేశంగా ప్రసంగించారు. దేశంలో ఒకవైపు రామమందిర నిర్మాణం జరుగుతుంటే.. మరోవైపు సీతామాతల్ని (ఆడపిల్లల్ని) సజీవ దహనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

'హైదరాబాద్​లో కాల్చిపడేశారు.. యూపీలో ఏం చేశారు?'

"సభలో ఎన్నో చట్టాల గురించి మాట్లాడుతున్నాం. అయితే వాస్తవంలో ఏమీ పనిచేయడం లేదు. మొన్న హైదరాబాద్​, బంగాల్​ మాల్డా, నిన్న ఉన్నావ్​. మనం ఎటు పోతున్నాం?

ఒకవైపు మర్యాదపురుషోత్తముడైన రాముడికి మందిరం నిర్మిస్తుంటే.. మరోవైపు మన సీతామాతల్ని (ఆడపిల్లల్ని) తగలబెడుతున్నారు. ఇది ప్రస్తుతం మన దేశ పరిస్థితి.

ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన ఘటనను అందరూ ఖండిస్తున్నాం. అయితే సర్కారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. చూడండి.. హైదరాబాద్​లో 'దిశ' నిందితుల్ని ఎన్​కౌంటర్​ చేశారు. పారిపోదాం అనుకుంటే.. హైదరాబాద్​ పోలీసులు కాల్చిపారేశారు. ఉత్తర్​ప్రదేశ్​ పోలీసులు నిందితుల్ని వదిలేశారు."

- అధీర్​ రంజన్​ చౌదరి, లోక్​సభలో కాంగ్రెస్​ పక్ష నేత

ABOUT THE AUTHOR

...view details