న్యాయ విభాగంలో ప్రధాన న్యాయమూర్తులను గౌరవప్రదంగా 'మై లార్డ్' లేదా 'లార్డ్షిప్' అని సంబోధించడం సాధారణం. వారి అత్యున్న అధికారాన్ని ఉపయోగించి వారిచ్చే తీర్పును భగవంతుడి ఆజ్ఞగా భావిస్తామని చెప్పడానికి సంకేతంగా కోర్టులోని ఇతర అధికారులు ప్రధాన న్యాయమూర్తులను 'మై లార్డ్' అని సంబోధిస్తారు. ఇది దేశంలో ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ. అయితే, బంగాల్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాత్రం ఈ పద్ధతిని మార్చేశారు. ఆయన్ను మై లార్డ్గా కాక, 'సర్' అని పిలిస్తే చాలంటున్నారు.
బంగాల్, అండమాన్-నికోబార్ దీవుల న్యాయాధికారులు ఇకపై తనను 'సర్' అని పిలవాలని స్పష్టం చేశారు బంగాల్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్. 'మై లార్డ్' అని పిలవాల్సిన పని లేదని అన్ని జిల్లాల న్యాయమూర్తులు, ప్రధాన న్యామూర్తులకు ఓ లేఖ ద్వారా తెలియజేశారు.