తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్​కు ఖుష్బూ గుడ్​బై- భాజపాకు జై

ప్రముఖ సినీ నటి ఖుష్భూ భాజపాలో చేరారు. కాంగ్రెస్​కు పార్టీకి రాజీనామా సమర్పించి 24 గంటలు గడవక ముందే ఆమె భాజపాలో చేరడం గమనార్హం. త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఖుష్భూ పార్టీ మారడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Khushbu leaves for New Delhi amid speculations of BJP switch
భాజపాలో చేరిన ప్రముఖ నటి ఖుష్భూ

By

Published : Oct 12, 2020, 1:51 PM IST

Updated : Oct 12, 2020, 2:08 PM IST

తమిళనాడుకు చెందిన ప్రముఖ సినీ నటి ఖుష్బూ.. భారతీయ జనతా పార్టీలో చేరారు. ఖుష్బూ భాజపాలో చేరతారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ఆమె భాజపా తీర్థం పుచ్చుకున్నారు.

భాజపాలో చేరిన ప్రముఖ నటి ఖుష్భూ
భాజపాలో చేరిన ప్రముఖ నటి ఖుష్భూ

కాంగ్రెస్​కు గుడ్​బై...

కాంగ్రెస్​లో ఖుష్బూ వ్యవహార శైలి కొంతకాలంగా చర్చనీయాంశమైంది. పార్టీ వైఖరికి భిన్నంగా జులైలో కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యావిధానాన్ని ఆమె స్వాగతిస్తున్నట్లు తెలిపారు. తర్వాత దుమారం రేగగా రాహుల్​కు క్షమాపణ చెప్పారు.

పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడుతున్నారంటూ ఖుష్బూను తొలుత జాతీయ అధికార ప్రతినిధి పదవి నుంచి కాంగ్రెస్‌ అధిష్ఠాననం తొలగించింది. కాసేపటికే కాంగ్రెస్‌ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి పంపారు.

దేశానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు సోనియాకు లేఖలో కృతజ్ఞతలు తెలిపారు ఖుష్భూ. పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తోన్న తన లాంటి వ్యక్తులకు కాంగ్రెస్‌లో గుర్తింపు లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కొంతకాలంగా తీవ్రంగా ఆలోచించిన తర్వాతే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో సంబంధం లేని నేతల పెత్తనం నచ్చక పార్టీని వీడుతున్నట్లు ఖుష్బూ రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

భాజపాకు బలం...

వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆమె చేరిక పార్టీకి బలం చేకూరుస్తుందని కమలనాథులు భావిస్తున్నారు.

Last Updated : Oct 12, 2020, 2:08 PM IST

ABOUT THE AUTHOR

...view details