తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హీరోపై అభిమానం హద్దు మీరి హంతకుడ్ని చేసింది! - rajinkanth fan mudered news

హీరోలంటే ఇష్టం ఉండొచ్చు.. కానీ, వారి కోసం జీవితాలను పాడుచేసుకునేంత పిచ్చి ఉండకూడదని మరోసారి రుజువైంది. తమిళనాడులో తాను అభిమానించే హీరో... కరోనా సహాయ నిధికి ఎక్కువ విరాళమిచ్చాడంటూ వాదించిన యువకుడు.. స్నేహితుడినే చంపి హంతకుడిగా మారాడు!

Actor Vijay fan Killed by Rajini Fan! Fight over corona relief fund
హీరోపై అభిమానం హద్దు మీరి హంతకుడ్ని చేసింది!

By

Published : Apr 24, 2020, 8:56 PM IST

హీరోపై అభిమానం హద్దుమీరి.. ఓ యువకుడు ఏకంగా ప్రాణమిత్రుడ్నే చంపిన ఘటన తమిళనాడులోకలకలం రేపింది.

22 ఏళ్ల యువరాజ్ తమిళ కథానాయకుడు​ విజయ్​కి వీరాభిమాని. అదే వీధిలో ఉండే దినేశ్​బాబు రజనీకాంత్​కు పెద్ద ఫ్యాన్​. దినేశ్​బాబు​, యువరాజ్​లు గాఢ స్నేహితులు.

విజయ్​ ఫ్యాన్​... యువరాజ్​
రజనీ ఫ్యాన్​.. దినేశ్​

వీరిద్దరూ గురువారం సాయంత్రం రోజూలాగే పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటున్నారు. మాటల మధ్యలో హీరోల ప్రస్తావన వచ్చింది. కరోనా బాధితుల సహాయ నిధికి మా హీరోనే ఎక్కువ విరాళమిచ్చారంటే.. మా హీరో ఇచ్చారంటూ వాదించుకున్నారు. కాసేపటికి.. వాదన కాస్తా దెబ్బలాటగా మారింది. ఆవేశంలో దినేశ్​... యువరాజ్​ను నెట్టేశాడు, అంతే యువరాజ్ ​రాయిపై పడి గాయం కావడం వల్ల అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

యువరాజ్​ మృతదేహాన్ని.. పుదుచ్చేరి కళాపేట్​లోని ఆసుపత్రికి పోస్టు మార్టం కోసం తరలించారు. మరకనమ్​ పోలీసులు దినేశ్​ను అదుపులోకి తీసుకున్నారు.

హీరోపై అభిమానం హద్దు మీరి హంతకుడ్ని చేసింది!

ఇదీ చదవండి:అప్పుడే పుట్టిన బిడ్డను ఎత్తుకుని 7 కి.మీ నడక

ABOUT THE AUTHOR

...view details