కర్ణాటక మండ్య ఎంపీ, ప్రముఖ సినీనటి సుమలతకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె ఫేస్బుక్ ద్వారా తెలిపారు.
"శనివారం నుంచి తలనొప్పి, గొంతు గరగర లాంటి లక్షణాలు కనిపించాయి. నియోజకవర్గం పర్యటన సందర్భంగా నాకు కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నా. వైద్య పరీక్షల్లో నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. ప్రస్తుతం నేను మా ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నాను. వైద్యుల పర్యవేక్షణలో తగిన చికిత్స తీసుకుంటున్నాను. నాకు రోగనిరోధక శక్తి బాగానే ఉంది. అభిమానుల ఆశీస్సులతో త్వరలోనే కోలుకుంటానని బలంగా నమ్ముతున్నాను."
- సుమలత అంబరీశ్, మండ్య ఎంపీ