తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'5 ట్రిలియన్ల​ ఆర్థిక వ్యవస్థే కాదు.. అంతకు మించి' - 'అవినీతిపై చర్యలు కార్పొరేట్​ అంతం కోసం కాదు'

దేశంలో పన్ను వ్యవస్థను సులభతరం చేస్తూ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పరిశ్రమల అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ బలోపేతం దిశగా ఎన్నో లక్ష్యాలను నిర్దేశించుకున్నామని స్పష్టం చేశారు. ఐదు ట్రిలియన్​ ఆర్థిక వ్యవస్థ ఒక దశ మాత్రమేనని.. అంతకు మించి భారీ ఆశయాల దిశగా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

PM
నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

By

Published : Jan 6, 2020, 8:45 PM IST

కొంత మంది అవినీతి పరులపై చర్యలు తీసుకున్నంత మాత్రాన కార్పొరేట్​ వ్యవస్థను ప్రభుత్వం ధ్వంసం చేస్తున్నట్టు కాదని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. కిర్లోస్కర్​ సోదరుల శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన.. తన పాలనపై ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రయత్నించారు.

"కొన్ని అవినీతి సంస్థలపై చర్యలు తీసుకున్నాం. అది చూసి కార్పొరేట్​ సంస్థలను ప్రభుత్వం అణచివేస్తోందని భావించవద్దు. పారదర్శక వాతావరణంలో పరిశ్రమలు ఎలాంటి భయం లేకుండా సంపదను సృష్టించాలన్నదే మా ప్రయత్నం. ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యాల్లో 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ ఒక దశ మాత్రమే. అంతకన్నా భారీ ఆశయాల దిశగా కృషి చేస్తున్నాం.

పన్ను వ్యవస్థలో పారదర్శకత, సమర్థత, జవాబుదారీ తనం ఉండాలన్నదే మా ధ్యేయం. పన్ను శాఖలో మానవ జోక్యం తగ్గించాలని ప్రయత్నిస్తున్నాం. కార్పొరేట్​ పన్నునూ అత్యల్పానికి తగ్గించాం."

- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

ఇదీ చూడండి: దిల్లీ దంగల్: త్రిముఖ పోరులో నిలిచి గెలిచేదెవరో?

ABOUT THE AUTHOR

...view details