భాజపా నేతృత్వంలోని కేంద్ర సర్కారుపై కొద్ది రోజులుగా విమర్శల దూకుడు పెంచారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. రోజుకో తీరులో కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. తాజాగా కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలివేనంటూ ఫిబ్రవరి నుంచి జులై వరకు పలు అంశాలతో ట్వీట్ చేశారు.
ఫిబ్రవరిలో 'నమస్తే ట్రంప్' సభ నిర్వహించగా.. మార్చిలో మధ్యప్రదేశ్లో ప్రభుత్వాన్ని కూలగొట్టారని ఆరోపించారు. జులైలో రాజస్థాన్లోనూ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు విశ్వప్రయత్నం చేశారని దుయ్యబట్టారు.