తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఐదేళ్లలో 2,200 మంది సీఏపీఎఫ్​ సిబ్బంది మరణం'

ప్రమాదాలు, ఆత్మహత్యలతో ఐదేళ్ల వ్యవధిలో 2వేలకు పైగా కేంద్ర బలగాల సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు ఎన్​ఆర్​సీబీ నివేదిక స్పష్టం చేసింది. ఏడాదివారీగా వివరాలు వెల్లడించింది.

Accidents, suicides claimed lives of 2,200 personnel in 2014-2018 period
'ఐదేళ్లలో 2,200 మంది సీఏపీఎఫ్​ సిబ్బంది మరణం'

By

Published : Jan 19, 2020, 1:28 PM IST

2014 నుంచి 2018 వరకు ఐదేళ్ల కాలంలో 2,200 మంది కేంద్ర బలగాల(సీఏపీఎఫ్​) సిబ్బంది ప్రమాదాలు, ఆత్మహత్యలకు బలైపోయినట్లు జాతీయ నేరాధికార విభాగం(ఎన్​ఆర్​సీబీ) తెలిపింది. 2018లో 104 మంది సీఏపీఎఫ్​ సిబ్బంది ప్రమాదాల్లో మరణించగా.. మరో 28 ఆత్మహత్యలతో కలిపి మొత్తం 132 మంది మరణించారని స్పష్టం చేసింది. సరిహద్దు భద్రతా దళం​(బీఎస్​ఎఫ్​), సీఆర్​పీఎఫ్​, సీఐఎస్​ఎఫ్​, ఇండో-టిబిట్​ సరిహద్దు పోలీసు దళం​(ఐటీబీపీ), అసోం రైఫిల్స్​(ఏఆర్)తో పాటు సషస్త్ర సీమా బల్(ఎస్​ఎస్​బీ), ఎన్​ఎస్​జీ వంటి రక్షణ దళాల సిబ్బందిని ఈ జాబితాలో పరిగణనలోకి తీసుకుంది.

ఏ ఏడాది ఎంతమంది

సీఏపీఎఫ్​ సిబ్బంది మరణాలకు సంబంధించి 2014లో తొలిసారి ఎన్ఆర్​సీబీ డేటాను సేకరించడం మొదలు పెట్టింది. అదే ఏడాదిలో మొత్తం 1,232 మంది ప్రమాదవశాత్తు మరణించగా.. 175 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు నివేదిక వెల్లడించింది. ప్రమాదాల కారణంగా 2017లో 113 మంది, 2016లో 260, 2015లో 193 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆత్మహత్యలతో 2017లో 60 మంది మృతి చెందగా.. 2016లో 74, 2015లో 60 మంది సీఏపీఎఫ్​ సిబ్బంది మరణిచినట్లు ఎన్​ఆర్​సీబీ స్పష్టం చేసింది.

ఒక్కొక్కరికి ఒక్కో సమస్య

2018లో మరణించిన సీఏపీఎఫ్​ సిబ్బందిలో 31.7 శాతం మంది విధుల్లో ఉండగానే మరణించినట్లు నివేదిక తెలిపింది. ఆత్మహత్య చేసుకున్న వారిలో 35.7 శాతం మంది కుటుంబసమస్యల కారణంగా మరణించగా.. పెళ్లి సంబంధిత సమస్యల వల్ల 17.9 శాతం ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది.

మొత్తం మీద 2018లో 1,34,516 ఆత్మహత్య కేసులు నమోదయ్యాయి. 2017నాటి గణాంకాలు చూస్తే 2018లో 3.6శాతం పెరిగాయి.

ABOUT THE AUTHOR

...view details