రాజస్థాన్ బిల్వాడా జిల్లా దేవలీ రహదారిపై వ్యాన్ను ట్రాలీ లారీ ఢీకొంది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో నలుగురు మరణించారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గాయపడ్డ వారిని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
వ్యాన్- లారీ ఢీ: నలుగురు దుర్మరణం - bilwara accident
రాజస్థాన్ బిల్వాడా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహానికి వెళ్లి వస్తున్న వ్యాన్ను ట్రాలీ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
వ్యాన్ను ఢీకొట్టిన ట్రాలీ లారీ -నలుగురు మృతి
ప్రమాద సమయంలో వ్యాన్లో 15మంది ఉన్నారని పోలీసులు తెలిపారు. వ్యానులో ఇరుక్కున్న మహిళలు, చిన్నారులను అతికష్టం మీద బయటకు తీశామని వివరించారు. ఈ ప్రమాదంతో దేవలీ- బిల్వాడా రహదారిపై దాదాపు గంట పాటు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడిందని తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఇదీ చదవండి:ఇకపై మరింత పెద్దగా పొగాకు హెచ్చరికల చిత్రాలు
Last Updated : Dec 7, 2020, 11:06 AM IST