ఛత్తీస్గఢ్ జగ్దల్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోడేనార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయ్కోట్ గ్రామంలో మినీ ట్రక్కు బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో 25 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
వాహన సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్న డ్రైవర్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు వాపోతున్నారు. రాయ్కోట్ నుంచి తోకాపాల్కు బయల్దేరిన ఈ వాహనం.. ఓవర్లోడ్ కారణంగా రాయ్కోట్ సమీపంలోనే ఓ దాబా వద్ద అదుపుతప్పి బోల్తా పడింది.