కర్ణాటక బగల్కోట్ జిల్లా శిరోలా గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేస్ఆర్టీసీకి చెందిన బస్సు ఓ కారును ఢీ కొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృత్యవాతపడ్డారు. బస్సులో ఉన్నవారికి స్వల్ప గాయాలయ్యాయి.
తెల్లవారు జామున జిల్లాలోని శిరోలా గ్రామంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు కారులో దర్వాద్ వైపు వెళుతున్న క్రమంలో.. చెరుకు గెడలు తీసుకెళ్తున్న ట్రాక్టర్ను ఓవర్టేక్ చేయబోయిన కేఎస్ఆర్టీసీ బస్సు.. కారును ఢీకొట్టింది.