తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గుజరాత్ ఎమ్మెల్యేలను రాజస్థాన్​కు తరలించిన కాంగ్రెస్ - గుజరాత్​ రాజకీయాలు

గుజరాత్​ నుంచి 24 మంది ఎమ్మెల్యేలను రాజస్థాన్​కు తరలించింది కాంగ్రెస్. సిరోహి జిల్లా అబూరోడ్​లో ఉన్న ఓ రిసార్టులో వారిని ఉంచింది. ఈ నెల 19న రాజ్యసభ ఎన్నికలు జరగాల్సి ఉండగా ఈ నిర్ణయం తీసుకుంది.

GUJ-CONGRESS
గుజరాత్ ఎమ్మెల్యే

By

Published : Jun 8, 2020, 10:02 AM IST

గుజరాత్​లోని సుమారు 24 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్.. రాజస్థాన్​కు తరలించింది. సిరోహి జిల్లాలోని అబూరోడ్​లో ఉన్న ఓ రిసార్టులో వారిని ఉంచింది. ఈ నెల 19న నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇటీవల రాజీనామా చేయటం కలకలం సృష్టించింది.

వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలందరినీ గుజరాత్​లోని ఆణంద్, రాజ్​కోట్​, అంబాజీల్లో ఉన్న రిసార్టులకు తరలించింది. వారిలో 21 మందిని తాజాగా రాజస్థాన్​కు పంపించింది. మరోవైపు లాక్​డౌన్​ నిబంధనలను ఉల్లంఘించిందంటూ రాజ్​కోట్​లో కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు ఉన్న రిసార్టుపై పోలీసులకు ఫిర్యాదు అందింది.

ABOUT THE AUTHOR

...view details