తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ ఒక్కడు.. 100 మందిని క్వారంటైన్​కు పంపాడు! - సూరజ్ వెంజరమూడు

కేరళ తిరువనంతపురంలో ఓ మేజిస్ట్రేట్​, సర్కిల్ ఇన్​స్పెక్టర్​ సహా 34మంది పోలీసులు, సెంట్రల్ జైలు అధికారులు, కొంత మంది ఆసుపత్రి సిబ్బంది.. మొత్తంగా ఓ 100మంది క్వారంటైన్​కు వెళ్లారు. అక్రమ మద్యం సరఫరా కేసులో అరెస్టు అయిన ఓ కరోనా పాజిటివ్​ వ్యక్తిని విచారించడమే దీనికి కారణం. ఇదే ఘటనతో పరోక్షంగా సంబంధమున్న ప్రముఖ మలయాళీ నటుడు సూరజ్​ కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.

Magistrate, cops go into quarantine
ఒకే ఒక్కడు 100 మందిని క్వారంటైన్​కు పంపాడు!

By

Published : May 25, 2020, 5:20 PM IST

Updated : May 25, 2020, 5:27 PM IST

కేరళ తిరువనంతపురంలో.. ఓ దిగువ కోర్టు మేజిస్ట్రేట్, కొంత మంది పోలీసులు సహా 100 మంది క్వారంటైన్​కు వెళ్లారు. కరోనా పాజిటివ్​గా తేలిన ఓ నిందితుడిని విచారించడమే ఇందుకు కారణం.

అక్రమ మద్యం కేసులో అరెస్టు

రెండు రోజుల క్రితం అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులు ఓ పోలీసును ఢీకొని పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే స్థానికులు వారిని పట్టుకుని అధికారులకు అప్పగించారు. నిందితులు ముగ్గురిని దిగువ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు.. తరువాత పూజాపుర సెంట్రల్​ జైలుకు తరలించి జ్యూడీషియల్ కస్టడీ కింద రిమాండ్​లో ఉంచారు.

అయితే నిందితులకు చేసిన కరోనా పరీక్షల్లో ఒకరికి పాజిటివ్​గా తేలింది. దీనితో అతనిని కొవిడ్-19 ఆసుపత్రికి తరలించారు.

'క్వారంటైన్​కు వెళ్లండి ప్లీజ్​...'

ఈ నేపథ్యంలో నిందితుడిని అరెస్టు చేసి తీసుకొచ్చిన వెంజరమూడు సర్కిల్ ఇన్​స్పెక్టర్ సహా 34మంది పోలీసులు, విచారణ చేసిన నేదుమంగాడ్ కోర్టు మేజిస్ట్రేట్​ క్వారంటైన్​కు వెళ్లారు. అలాగే నిందితులకు పరీక్షలు నిర్వహించిన కొంత మంది ఆసుపత్రి సిబ్బంది, వెంజరమూడు కేంద్ర కారాగారంలోని 12మంది ఉద్యోగులు కూడా నిర్బంధంలోకి వెళ్లాల్సి వచ్చింది.

స్వీయ నిర్బంధంలో సినీ నటుడు

ప్రముఖ మలయాళీ నటుడు సూరజ్

ప్రముఖ మలయాళీ సినీ నటుడు సూరజ్ వెంజరమూడు, వామనపురం ఎమ్మెల్యే డీ.కే.మురళి (సీపీఐ) స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. వీరు హాజరైన ఓ శుభకార్యానికి.. పూజాపుర సెంట్రల్​ జైలు పరిధిలోని సర్కిల్ ఇన్​స్పెక్టర్​ కూడా హాజరుకావడమే ఇందుకు కారణం.

ఇదీ చూడండి:3 నెలల క్వారంటైన్​ పూర్తి.. ఆ పిల్లికి స్వేచ్ఛ!

Last Updated : May 25, 2020, 5:27 PM IST

ABOUT THE AUTHOR

...view details