తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 'ప్రచార నినాదం' తెలుసా..? - దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా నినాదం తెలుసా..?

భారతీయ జనతా పార్టీపై విమర్శలు గుప్పించారు దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్​ ఆద్మీ పార్టీ(ఆప్​) అధినేత అరవింద్​ కేజ్రీవాల్​. 2020 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో... అబ్​కీ బార్​ 3 పార్​(ఈ సారి 3 సీట్ల కంటే ఎక్కువ నెగ్గుతాం) భాజపా ప్రచార నినాదమని ఎద్దేవా చేశారు. దిల్లీ భాజపా చీఫ్​ మనోజ్​ తివారీ... మంచి గాయకులంటూ చమత్కరించారు.

abki-baar-3-paar-would-be-bjps-slogan-for-delhi-assembly-polls-kejriwal
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా నినాదం తెలుసా..?

By

Published : Dec 7, 2019, 11:09 PM IST

Updated : Dec 7, 2019, 11:50 PM IST

భాజపాపై విమర్శలు గుప్పించిన అరవింద్​ కేజ్రీవాల్​

రానున్న దిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ ఎన్నికల్లో.. అబ్​కీ బార్​ 3 పార్​(ఈ సారి 3 సీట్ల కంటే ఎక్కువ గెలుస్తాం) భాజపా ప్రచార నినాదమని ఎద్దేవా చేశారు.

2015 దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆప్​ 67 స్థానాల్లో గెలుపొందగా... భాజపా 3 సీట్లు నెగ్గింది. దీనిని గుర్తు చేస్తూ కాషాయ పార్టీపై రాజకీయ విమర్శలు గుప్పించారు. హిందుస్తాన్​ టైమ్స్​ లీడర్​షిప్​ సదస్సు​లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు కేజ్రీవాల్​. ఆమ్​ ఆద్మీ పార్టీ.. ప్రచార నినాదం అబ్​కీ బార్​ 67 పార్​(ఈ సారి 67 సీట్లను అధిగమిస్తాం) అని తెలిపారు.

ఆయన మంచి సింగర్​....

దిల్లీ భాజపా అధ్యక్షుడు మనోజ్​ తివారీని ఎన్నికల్లో గట్టిపోటీగా భావిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు.. ఆయన పాటలు బాగా పాడుతారని ఆప్​ అధినేత ఎద్దేవా చేశారు.

''ఆయన పాడిన రింకియా కే పాపా'' పాట విన్నారా మీరు అంటూ చమత్కరించారు.

Last Updated : Dec 7, 2019, 11:50 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details