తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వీర్​ చక్ర' అవార్డుకు అభినందన్​ పేరు సిఫార్సు

వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ బదిలీ అయ్యారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆయనను  శ్రీనగర్‌ ఎయిర్‌బేస్‌ ఆవలకు బదిలీ చేసింది భారత వాయుసేన. పాక్​కు చెందిన ఎఫ్​-16 యుద్ధ విమానాన్ని కూల్చివేసిన అభినందన్​ పేరును భారత వాయుసేన 'వీర్​ చక్ర' అవార్డుకు ప్రతిపాదించింది.

వీర్​చక్ర అవార్డుకు అభినందన్​ పేరు సిఫార్సు

By

Published : Apr 20, 2019, 11:25 PM IST

Updated : Apr 21, 2019, 12:07 AM IST

వింగ్​ కమాండర్​ అభినందన్​కు 'వీర్​ చక్ర'

వింగ్​ కమాండర్​ అభినందన్ వర్ధమాన్​ను శ్రీనగర్ ఎయిర్​బేస్​నుంచి పశ్చిమ సెక్టార్​లో కీలక ఎయిర్​ బేస్​కు బదీలీ చేసింది భారత వాయుసేన. ఆయన భద్రత దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

'వీర్​ చక్ర అవార్డు'కు సిఫారసు

పాక్​ ఎఫ్​-16 జెట్​ను కూల్చివేసి ధైర్యసాహసాలు ప్రదర్శించిన వింగ్​ కమాండర్​ అభినందన్​ వర్ధమాన్​ పేరును భారత వాయుసేన 'వీర్​ చక్ర' అవార్డుకు సిఫార్సు చేసింది. పాకిస్థాన్ బాలాకోట్​లో మెరుపు దాడులు నిర్వహించిన పైలట్లను 'వాయుసేన మెడల్' ​కు ప్రతిపాదించింది.

పరమ వీర్‌ చక్ర, మహావీర్‌ చక్ర తరవాత యుద్ధ సమయాల్లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారికి ఇచ్చే మూడో అత్యున్నత పురస్కారమే వీర్ చక్ర.

ఇదీ చూడండి: న్యాయవ్యవస్థను అస్థిరపరిచే కుట్ర: సీజేఐ

Last Updated : Apr 21, 2019, 12:07 AM IST

ABOUT THE AUTHOR

...view details