తెలంగాణ

telangana

ETV Bharat / bharat

త్వరలోనే భారత్​లో 'యాంటీబాడీ' ప్రయోగశాల ప్రారంభం - త్వరలోనే భారత్‌లో కొవిడ్‌ ఆధారిత ప్రతిరోదక పరీక్షలు

భారత్​లో త్వరలోనే యాంటీబాడీ ప్రయోగశాల ప్రారంభం కానుంది. ఈ నెలాఖరులోగా ఈ పరీక్షలను ఆరంభించే అవకాశాలున్నాయని ప్రముఖ పరిశోధన సంస్థ అబాట్​ తెలిపింది.

Abbott's COVID-19 laboratory-based antibody tests to be available in India by May-end
త్వరలోనే భారత్‌లో కొవిడ్‌ ఆధారిత ప్రతిరోదక పరీక్షలు

By

Published : May 5, 2020, 7:23 AM IST

ప్రముఖ పరిశోధన సంస్థఅబాట్ భారత్‌లో యాంటీబాడీ ప్రయోగశాల ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.దీంతో ఈ నెల చివరినాటికి భారత్‌లో ఈ పరీక్షలు అందుబాటులోకి రానున్నాయని ఓ ప్రకటనలో చెప్పింది అబాట్‌. ఆ తర్వాత అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనే పరీక్షలను వీలైనంత త్వరగా మార్కెట్లోకి తీసుకెళ్లేందుకు దృష్టి సారించినట్లు అబాట్​ భారత డయాగ్నొస్టిక్స్‌ బిజినెస్‌ జనరల్‌ మేనేజర్‌ నరేంద్ర వార్దే చెప్పారు.

'మేం యాంటీబాడీ పరీక్షలను అందించడం చాలా గర్వంగా ఉంది. వైరస్‌ సోకిన వ్యక్తులను పసిగట్టేందుకు ఈ పరీక్షలు సాయపడతాయి.'

- నరేంద్ర వార్దే, జనరల్‌ మేనేజర్‌ - అబాట్​ భారత డయాగ్నొస్టిక్స్‌ బిజినెస్.

ఈ యాంటీబాడీ పరీక్షల ద్వారా గతంలో వైరస్‌ బారినపడిన వ్యక్తులను గుర్తించేందుకు వీలుంటుంది. ఈ రకమైన పరీక్షలు.. వైరస్‌ చికిత్సతోపాటు వ్యాక్సిన్​ను అభివృద్ధి చేసేందుకు ఎంతగానో సహకరించనున్నాయి.

సుదీర్ఘకాలంగా అంటు వ్యాధులకు సబంధించి విస్తృతంగా పరిశోధనలు చేస్తున్న అబాట్.. మొదటి దశ హెచ్‌ఐవీ పరీక్షల్లోనూ కీలకంగా వ్యవహరించింది.

ఇదీ చదవండి:కరోనా వేళ మీ కళ్లు భద్రమేనా? కాపాడుకోండిలా..

ABOUT THE AUTHOR

...view details