తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డౌన్​లోడ్లలో 'ఆరోగ్యసేతు' యాప్​ టాప్​

ఏప్రిల్​ నెలలో ఎక్కువ మంది డౌన్​లోడ్​ చేసుకున్న హెల్త్​కేర్​ యాప్​గా ఆరోగ్య సేతు అవతరించిందని నీతి ఆయోగ్​ సీఈఓ అమితాబ్​ కాంత్​ వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా డౌన్​లోడ్​ చేసిన టాప్​-10 యాప్​లలో ఒకటిగా నిలిచిందని తెలిపారు.

Aarogya Setu most downloaded healthcare app in world: Kant
ప్రపంచంలోనే ఎక్కువ మంది డౌన్​లోడ్ యాప్​ ఆరోగ్యసేతు

By

Published : May 9, 2020, 6:55 AM IST

కొవిడ్​-19 రోగులను గుర్తించడం కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆరోగ్య సేతు యాప్ మరో ఘనతను సాధించింది. ఎక్కువ మంది డౌన్​లోడ్​ చేసిన హెల్త్​కేర్​ యాప్​గా అవతరించిందని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ తెలిపారు. ఏప్రిల్​లో ప్రపంచంలోనే డౌన్​లోడ్​ చేసిన టాప్-10 యాప్​లలో ఇది కూడా ఒకటని వెల్లడించారు.

"కరోనా కట్టడికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవటంలో ప్రపంచ దేశాల్లో భారత్​ ముందు వరుసలో ఉంది. ఆరోగ్య సేతు యాప్​ ఎక్కువ మంది డౌన్​లోడ్​ చేసిన హెల్త్​కేర్​ యాప్​. 2020 ఏప్రిల్​లో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది డౌన్​లోడ్​ చేసిన టాప్​ 10 యాప్​లలో ఒకటిగా నిలిచింది."

-అమితాబ్​ కాంత్​, నీతి అయోగ్​ సీఈఓ

మే 4 వరకు దేశ వ్యాప్తంగా 9 కోట్ల మంది ఈ యాప్​ను డౌన్​లోడ్​ చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. కరోనా నివారణ కోసం ఈ యాప్​ను ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా డౌన్​లోడ్​ చేసుకోవాలని సూచించింది కేంద్ర ప్రభుత్వం.

చుట్టు పక్కల ప్రాంతంలో ఉన్న కరోనా బాధితులను గుర్తించటం కోసం ఆరోగ్య సేతు యాప్​ను డౌన్​లోడ్​ చేసుకోవాలని ఏప్రిల్​ 14న ప్రజలకు సూచించారు ప్రధాని. నీతి ఆయోగ్​, ఐటీ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ యాప్​ను అభివృద్ధి చేశాయి.

ABOUT THE AUTHOR

...view details