2022 ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయనున్నట్లు ఆమ్ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.
"8 ఏళ్లలో ఆప్ పార్టీ దిల్లీలో మూడు సార్లు అధికారంలోకి వచ్చింది. పంజాబ్లో ప్రధాన ప్రతిపక్షంగా పనిచేసింది. రానున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం. దిల్లీలో ఉన్న చాలామంది యూపీ ప్రజలు...ఉత్తర్ప్రదేశ్లోనూ పోటీ చేయమని మాకు సలహాలు ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వంపై తాము అసంతృప్తితో ఉన్నామని తెలిపారు."