తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆప్​ శాసనసభాపక్ష నేతగా కేజ్రీవాల్​ ఏకగ్రీవం

ఆమ్​ ఆద్మీ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత అరవింద్​ కేజ్రీవాల్​ ఎన్నికయ్యారు. దిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు ఎమ్మెల్యేలు. ఈనెల 16న దిల్లీ రాంలీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు కేజ్రీ.

AAP MLAs choose Kejriwal as leader of legislature party
ఆప్​ శాసనసభాపక్ష నేతగా కేజ్రీవాల్​ ఎన్నిక

By

Published : Feb 12, 2020, 2:02 PM IST

Updated : Mar 1, 2020, 2:13 AM IST

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన ఆమ్​ ఆద్మీ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు ముమ్మరం చేసింది. నూతన ఎమ్మెల్యేల సమావేశంలో ఆప్​ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత అరవింద్​ కేజ్రీవాల్​ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నేతలు.

దిల్లీలోని సివిల్​ లైన్స్​లోని ఆయన అధికారిక నివాసంలో ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు కేజ్రీవాల్​. పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, ప్రమాణ స్వీకారోత్సవంపై చర్చించారు.

ఈ నెల 16న ప్రమాణం..

దిల్లీ ముఖ్యమంత్రిగా మూడోసారి ప్రమాణం చేయనున్నారు కేజ్రీవాల్​. ఈనెల 16న ముహూర్తం ఖరారు చేశారు. రాం​లీలా మైదానంలో 16న ఉదయం 10 గంటలకు కార్యక్రమం ఉంటుందని.. ఆయనతోపాటే మంత్రులు ప్రమాణం చేస్తారని ఉపముఖ్యమంత్రి మనీశ్​ సిసోడియా వెల్లడించారు.

ఇదీ చూడండి: కేజ్రీవాల్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు

Last Updated : Mar 1, 2020, 2:13 AM IST

ABOUT THE AUTHOR

...view details