హాథ్రస్ బాధితురాలి కటుంబాన్ని కలిసిన ఆమ్ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే కుల్దీప్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కొవిడ్-19 నిబంధనలు ఉల్లంఘిస్తూ కరోనా పాజిటివ్‌గా తేలిన తర్వాత హాథ్రస్ వెళ్లినందుకు అంటువ్యాధుల చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదుచేశారు.
కరోనాతోనే 'హాథ్రస్'కు ఎమ్మెల్యే ఓదార్పు యాత్ర - ఆప్ ఎమ్మెల్యే కుల్దీప్పై కేసు
కరోనా బారినపడి హాథ్రస్ అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని కలిసిన ఎమ్మెల్యేపై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. కొవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించారంటూ అంటువ్యాధుల చట్టం కింద చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
![కరోనాతోనే 'హాథ్రస్'కు ఎమ్మెల్యే ఓదార్పు యాత్ర aap mla](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9084498-376-9084498-1602066173125.jpg)
ఆప్ ఎమ్మెల్యే
తనకు కరోనా పాజిటివ్‌గా తేలిందని సెప్టెంబర్ 29న దిల్లీలోని కోండ్లీ ఎమ్మెల్యే ట్విట్టర్ వేదికగా తెలిపారు. అనంతరం అక్టోబర్ 4న హాథ్రస్ బాధితురాలి కుటుంబాన్ని కలిశారు. కొవిడ్-19 నిబంధనల ప్రకారం.. 14 రోజులు ఐసోలేషన్ ఉండాల్సి ఉందని, ఈ మేరకు ఆయనకు నోటీసులు పంపుతామని స్పష్టం చేశారు పోలీసులు.
ఇదీ చూడండి:హాథ్రస్ ఘటనపై 'సిట్' నివేదిక ఆలస్యం
Last Updated : Oct 7, 2020, 5:16 PM IST