తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'లగే రహో'.. కేజ్రీపై నయా ప్రచార గీతం - aap

దిల్లీలో శాసనసభ ఎన్నికలకు నోటిఫికేషన్​ విడుదలైన నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారం వైపు దృష్టి సారించాయి. ఓటర్లను ఆకర్షించేందుకు తమదైన రీతిలో ప్రయత్నాలు చేపడుతున్నాయి. ఆమ్​ ఆద్మీ పార్టీ (ఆప్​) ఎన్నికల ప్రచారం కోసం 'లగే రహో కేజ్రీవాల్​' అంటూ సాగే ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరించింది. ఈ గీతాన్ని ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా విడుదల చేశారు.

AAP launches 'Lage Raho Kejriwal' theme song for assembly poll campaign
ఎన్నికల సిత్రం: కేజ్రీపై ప్రచార గీతం-'లగే రహో'

By

Published : Jan 11, 2020, 10:48 PM IST

దేశ రాజధాని దిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన వేళ గెలుపు కోసం ప్రచారంపై దృష్టి సారించాయి పార్టీలు.ప్రజలను తమ వైపు తిప్పుకొనేందుకు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఆమ్​ ఆద్మీ పార్టీ(ఆప్)అధ్యక్షుడు కేజ్రీవాల్​పై'లగే రహో కేజ్రీవాల్​'అనే ప్రచార గీతాన్ని ఆవిష్కరించింది.

విశాల్​ దద్లానీ స్వరపరచిన ఈ గీతాన్ని దిల్లీలోని ఆప్​ పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి ఆప్​ రాజ్యసభ ఎంపీ సంజయ్​ సింగ్​ పాల్గొన్నారు.

"ముఖ్యమంత్రి కేజ్రీవాల్​పై దిల్లీ ప్రజలకు ఉన్న అభిమానం, ఆప్ ప్రభుత్వం సాధించిన విజయాలకు ఈ ప్రచార గీతం అద్దం పడుతోంది. దిల్లీ ప్రజల కోసం గత ఐదేళ్లలో మేము విశ్రాంతి లేకుండా శ్రమించాం. కేజ్రీవాల్​ అందించిన పారదర్శక పాలన పట్ల ఎంతో సంతోషంగా ఉన్నామని దిల్లీ ప్రజలు చెబుతున్నారు."

-మనీశ్ సిసోడియా,దిల్లీ ఉపముఖ్యమంత్రి.

ఎన్నికల సిత్రం: కేజ్రీపై ప్రచార గీతం-'లగే రహో'

ఈ గీతం ప్రజల ప్రతిస్పందన మాత్రమే కాదని,రాబోయే ఐదేళ్లలో దిల్లీ నగర ప్రచారగీతంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు సిసోడియా.గత ఎన్నికల ప్రచారంలోనూ'పాంచ్​సాల్​ కేజ్రీవాల్​'అనే ప్రత్యేక గీతాన్ని స్వరపరిచినట్లు గుర్తు చేశారు.

పాటను'ఫ్లాష్​ మాబ్​గా'ప్రదర్శించటం కోసం20బృందాలను సిద్ధం చేశారని తెలిపారు సిసోడియా.రానున్న రోజుల్లో ఈ పాటకు వందల మంది నృత్యం చేస్తారని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు.ఈ బృందాలు ప్రజలు సమూహంగా ఉన్న చోట,మార్కెట్లు,వీధుల్లో ప్రచార గీతాన్ని ప్రదర్శిస్తారని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.

ఫిబ్రవరి8న దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఫిబ్రవరి11న ఫలితాలు వెలువడనున్నాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details