ఆమ్ఆద్మీ పార్టీ ... దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పీఠమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 'కామ్ కీ చాయ్' అంటూ టీ స్టాల్‌ను ఏర్పాటు చేసి వినూత్న ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించింది. ప్రజలకు చేరువవటానికి గతంలో మోదీ ఉపయోగించిన 'చాయ్ పే చర్చ' అస్త్రాన్నే ఆప్ వినియోగించి అన్నీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీ స్టాల్స్‌ను ఏర్పాటు చేయడానికి సమాయత్తమవుతుంది.
'కామ్ కీ చాయ్' ఏంటి?
కామ్ కీ చాయ్... ఆమ్ఆద్మీ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి పథకాలు...వాటి పురోగతిని ప్రజలకు వివరించడం దీని ఉద్దేశం. ఇక్కడ విక్రయించే టీలకు వివిధ పథకాల పేర్లను పెట్టి ప్రచారం చేస్తోంది.
రకరకాల 'టీ'లు
ఈ టీ స్టాల్స్‌లో... ప్రభుత్వం అభివృద్ధి చేసిన పథకాల పేర్లనే వివిధ 'టీ'లకు నామకరణం చేసి విక్రయిస్తోంది. 'శిక్షా వాలీ చాయ్', 'స్వాస్థ్య వాలీ చాయ్', 'వికాస్ వాలీ చాయ్', 'స్పెషల్ చాయ్' ఇక్కడ దొరుకుతాయి.
శిక్షా వాలీ చాయ్
విద్యా, క్రీడా రంగాల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సదుపాయలు, మెగా ఉపాధ్యాయ-తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు వంటి అంశాలను ఈ చాయ్ ద్వారా ప్రజలకు వివరిస్తోంది.
స్వాస్థ్య వాలీ చాయ్