తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ తీర్పు: హస్తినను మరోసారి ఊడ్చేసిన ఆప్ - తాజా వార్తలు దిల్లీ ఎన్నికలు

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు మళ్లీ పట్టం కడుతూ ఓటర్లు తీర్పునిచ్చారు. కేజ్రీవాల్​ మరోసారి సీఎం పీఠాన్ని అధిరోహించనున్నారు. ఇప్పటికే సాధారణ మెజారిటీ స్థానాలను ఆప్​ సొంతం చేసుకుంది.

aap-crosses-the-magic-figure-in-delhi-assembly-election-results
దిల్లీ తీర్పు: హస్తినను మరోసారి ఊడ్చేసిన ఆప్

By

Published : Feb 11, 2020, 2:51 PM IST

Updated : Feb 29, 2020, 11:50 PM IST

దేశ రాజధాని ప్రజలు మరోసారి ఆమ్‌ ఆద్మీ పార్టీకే జై కొట్టారు. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆప్‌ వరుసగా మూడోసారి విజయకేతనం ఎగురవేసింది. మొత్తం 70 నియోజకవర్గాలకు గాను ఆ పార్టీ ఇప్పటికే సాధారణ మెజార్టీ స్థానాలను సొంతం చేసుకుంది. మిగతా స్థానాల్లో గెలుపు దిశగా సాగుతోంది.

జిల్లాల వారీగా చూసినా మొత్తం 11 జిల్లాల్లోనూ ఆప్‌ తిరుగులేని ఆధిక్యం కనబరుస్తోంది. కేజ్రీవాల్‌ పార్టీ జోరు ముందు ప్రత్యర్థి పార్టీలు చిత్తయ్యాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం అందుకున్న భాజపాకు అసెంబ్లీ పోరులో మాత్రం మరోసారి పరాజయం తప్పలేదు. అటు కాంగ్రెస్​కు మరోసారి దిల్లీలో తీవ్ర నిరాశే ఎదురైంది.

దిల్లీ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ముందంజలో కొనసాగుతున్నారు. న్యూదిల్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఘన విజయం సాధించారు. పట్‌పడ్‌గంజ్‌ స్థానం నుంచి పోటీలో ఉన్న ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాతో మాత్రం విజయం దోబూచులాడుతోంది.

Last Updated : Feb 29, 2020, 11:50 PM IST

ABOUT THE AUTHOR

...view details