ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఒక రాజకీయ పార్టీ ప్రత్యేక ఛానల్ను ఏర్పాటు చేయడం ప్రవర్తన నియమావళిని అతిక్రమించడం కాదా అని ఈసీని ప్రశ్నించింది.
"ఎన్నికల కోడ్ అమలులో ఉన్నపుడు ఒక రాజకీయ పార్టీ సొంత ఛానల్ను స్థాపించేందుకు అనుమతించవచ్చా? ఒకవేళ ఈసీ అనుమతులు లేకపోతే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఛానల్ను ప్రారంభించేందుకు భాజపాకు మీడియా ధ్రువీకరణ కమిటీ (ఎంసీసీ) ఆమోదం తెలిపిందా?
ఎంసీసీ అనుమతులు లేకుండానే ఛానల్ ప్రారంభమైతే షోకాజ్ నోటీసులు ఎందుకు జారీ చేయలేదు? న్యాయ ప్రమాణాల ప్రకారం డబ్బు, అధికారంతో సంబంధం లేకుండా అన్ని రాజకీయ పార్టీలకు ఓటర్లను చేరుకునేందుకు సమాన అవకాశాలు ఉండాలి. ఈ ప్రధాన సూత్రాన్ని విస్మరించిన భాజపా 24 గంటల ప్రసారాలతో 'నమో టీవీ'ని ప్రారంభించింది."-ఈసీకి లేఖలో ఆమ్ ఆద్మీ పార్టీ