తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గంభీర్​ ప్రత్యర్థి కన్నీరు... భాజపాపై తీవ్ర విమర్శలు - ఆప్

తూర్పుదిల్లీ నియోజకవర్గం ఆప్ అభ్యర్థి అతిషి కంటతడి పెట్టారు. భాజపా అభ్యర్థి గౌతమ్​ గంభీర్​ తనను దారుణంగా కించపరుస్తున్నారని ఆరోపించారు.

గంభీర్​ ప్రత్యర్థి కన్నీరు

By

Published : May 9, 2019, 6:15 PM IST

తూర్పు దిల్లీ నియోజకవర్గం ఆప్ అభ్యర్థి అతిషి మార్లినా కంటతడి పెట్టారు. తనను భాజపా, ఆ పార్టీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ దారుణంగా కించపరిచారని ఆరోపించారు.

భాజపా సభ్యులు, గౌతమ్ గంభీర్ అనుచరులు తూర్పుదిల్లీ లోక్​సభ నియోజకవర్గం పరిధిలోని అపార్ట్​మెంట్లలో కరపత్రాలు పంచి పెడుతున్నారని ఆరోపించారు అతిషి. ఆ కరపత్రాల్లో తన గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. తన తండ్రి, తల్లి, భర్త వేర్వేరు రాష్ట్రాల్లో పుట్టిన విషయాన్నీ రాజకీయం కోసం దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు అతిషి. దిల్లీలో ఆప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్​మీట్​లో కన్నీటిపర్యంతం అయ్యారు.

"ఒక మహిళా అభ్యర్థిపై ఇలాంటి దారుణానికి ఒడిగట్టిన గంభీర్ తూర్పు దిల్లీలోని లక్షలాది మహిళల రక్షణకు ఏం చేయగలరు?"
-అతిషి, ఆప్ అభ్యర్థి

ఈ కరపత్రాలపై ఎన్నికల కమిషన్​కు ఫిర్యాదు చేస్తామన్నారు ఆప్​ నేతలు.

గంభీర్​ ప్రత్యర్థి కన్నీరు...

ABOUT THE AUTHOR

...view details