తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్​తో పొత్తు కుదరదు: ఆమ్​ ఆద్మీ - దిల్లీ

దిల్లీ సహా ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్​ పార్టీతో పొత్తు లేదని ఆమ్​ ఆద్మీ పార్టీ తేల్చి చెప్పింది. పొత్తుకు సానుకూలంగా కాంగ్రెస్​ చేసిన ప్రతిపాదనను తిరస్కరించింది.

కాంగ్రెస్​తో పొత్తు కుదరదు: ఆమ్​ ఆద్మీ పార్టీ

By

Published : Apr 11, 2019, 7:45 AM IST

కాంగ్రెస్​తో పొత్తు కుదరదు: ఆమ్​ ఆద్మీ

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీతో పొత్తుపై ఆమ్​ ఆద్మీ పార్టీ స్పష్టతనిచ్చింది. ఏ రాష్ట్రంలోనూ హస్తం పార్టీతో జతకట్టేది లేదని ఆ పార్టీ సీనియర్​ నేత సంజయ్​ సింగ్​ తేల్చి చెప్పారు. ఆ​ పార్టీ ప్రతిపాదనను తిరస్కరిస్తూ... ఇకపై కాంగ్రెస్​తో పొత్తుకు సంబంధించిన చర్చలు జరగవని సంజయ్​ స్పష్టం చేశారు.

పంజాబ్​లో ఆప్​కు నలుగురు ఎంపీలు, 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికి ఒక్క స్థానాన్నీ కేటాయించకపోవడాన్ని సంజయ్​ తప్పుపట్టారు. గోవా, చండీగఢ్​లోనూ ఇదే పరిస్థితి నెలకొందని వెల్లడించారు​. దిల్లీలో ఎటువంటి ప్రభావం లేని కాంగ్రెస్​ తమకు 3 సీట్లు ఇస్తామని ప్రతిపాదించడం హాస్యాస్పదమన్నారు.

పొత్తు ఏర్పాటుకు అన్ని మార్గాలు మూసుకుపోయాయని... దీని వల్ల భాజపా లబ్ధిపొందే అవకాశం ఉందని తెలిపారు.

ఇదీ చూడండి: భారత్​ భేరి: ఎన్నికల భారతంలో తొలిదశ పోలింగ్

ABOUT THE AUTHOR

...view details