దిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్‌పై దాడికి నేతల అసంతృప్తే కారణమని పోలీసులు వెల్లడించారు. ఘటనపై డీసీపీ స్థాయి అధికారితో విచారణ జరిపించనున్నామని అధికారులు వెల్లడించారు. సైన్యంపై ఆప్ నేతలకు నమ్మకం లేదనే వ్యాఖ్యల పట్ల ఆగ్రహంతో ఉన్నట్లు నిందితుడు వెల్లడించాడని సమాచారం.
ఆప్ నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
"ఆప్ టోపీ, కండువాను ధరించి సీఎం భద్రతా వలయం లోపలే ఆయన ఉన్నాడు. పార్టీకి చెందిన నేతగా భావించి ఎవరూ ఆయనకు అభ్యంతరం తెలపలేదు. వాహనానికి కుడివైపున నిల్చున్న అతడు ఒక్కసారిగా జీపు ఎక్కి సీఎంపై దాడికి తెగబడ్డాడు."-పోలీసుల ప్రకటన