విమాన ప్రయాణాలను ప్రజలకు మరింత దగ్గర చేసే దిశగా తీసుకొచ్చిన ఉడాన్ పథకం కింద 2024 నాటికి 100 విమానాశ్రయాలను నిర్మించాలని కేంద్రం సంకల్పించింది. ఇందులో హెలిపోర్టులు, వాటర్డ్రూమ్లు కూడా ఉండనున్నాయని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) తెలిపింది. ఉడాన్ పథకం తీసుకువచ్చి నేటికి నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
2024 నాటికి మరో వంద విమానాశ్రయాలు.! - 2024 నాటికి వంద విమానాశ్రయాలు
ఉడాన్ ప్రాజెక్టులో భాగంగా దేశంలో మరిన్ని విమానాశ్రయాలను నిర్మించాలని కేంద్రం భావిస్తోంది. 2024లోగా దాదాపు 100 ఎయిర్పోర్టులను అందుబాటులోకి తీసుకురానుంది.
2024 నాటికి వంద విమానాశ్రయాలు.!
దేశవ్యాప్తంగా 50 విమానాశ్రయాలను అభివృద్ధి చేసున్నట్లు ఏఏఐ పేర్కొంది. మరో నాలుగేళ్లలో వంద ఎయిర్పోర్టులను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఉడాన్ నాలుగో వార్షికోత్సవంలో పాల్గొన్న ఏఏఐ ఛైర్మన్ అరవింద్ సింగ్.. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా విమానాశ్రయాల నిర్మాణాలు జరగాలన్నారు.