తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లాక్​డౌన్​ కలిపిన కథ: 4 ఏళ్ల తర్వాత తిరిగొచ్చిన సోదరి - karnataka police

లాక్​డౌన్​ పుణ్యమా అని ఇద్దరు తోబుట్టువులు నాలుగేళ్ల తర్వాత తిరిగి కలుసుకున్నారు. అవును తప్పిపోయి ఇక రాదనుకున్న సోదరి.. కరోనా కాలంలో తిరిగొచ్చింది. కర్ణాటక పోలీసులు, మహిళా-శిశు సంక్షేమ అధికారుల చొరవే వారి కుటుంబంలో ఆనందం నింపింది.

A young woman Who disappeared 4 years ago Has got Amid the Corona
లాక్​డౌన్​ వల్ల నాలుగేళ్ల తర్వాత కలుసుకున్న తోబుట్టువులు!

By

Published : Jun 13, 2020, 11:03 AM IST

ఎందరినో ముప్పుతిప్పలు పెట్టిన లాక్​డౌన్​.. మహారాష్ట్రకు చెందిన ఓ కుటుంబంలో మాత్రం సంతోషాన్ని నింపింది. నాలుగేళ్ల కింద తప్పిపోయిన ఓ అమ్మాయి.. తిరిగి తన సోదరుడిని చేరుకుంది.

లాక్​డౌన్​ వల్ల నాలుగేళ్ల తర్వాత కలుసుకున్న తోబుట్టువులు!

మహారాష్ట్ర లాథూర్​కు చెందిన ప్రసన్న జోషి సోదరి నాలుగేళ్ల కింద కనబడకుండా పోయింది. తోబుట్టువు కోసం జోషి వెతకని చోటంటూ లేదు. పోలీసులకూ ఫిర్యాదు చేశాడు. రెండేళ్లు వెతికినా సోదరి ఆచూకీ దొరకలేదు. దీంతో ఆశలు వదులుకున్నాడు.

అయితే, లాక్​డౌన్​ వేళ కర్ణాటక బళ్లారి హోస్​పేట్​లో తిరుగుతూ కనిపించింది జోషి సోదరి. కరోనా జాగ్రత్తలు విస్మరించి బయట తిరుగుతున్న ఆమె మహిళా-శిశు సంక్షేమ అధికారుల కంటబడింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని, స్థానిక డిప్యూటీ కమిషనర్ ఎస్​ ఎస్ నకుల్​కు సమాచారమిచ్చారు. ​

లాక్​డౌన్​ వల్ల నాలుగేళ్ల తర్వాత కలుసుకున్న తోబుట్టువులు!

నకుల్​ బృందం ఆమె చిరునామా కోసం విచారించారు. కానీ, మతిస్థిమితం సరిగ్గా లేక ఆమె చిరునామా చెప్పలేకపోయింది. దీంతో, ఆమె ఫొటో ఫేస్​బుక్​లో పెట్టి సమాచారం కోసం ప్రయత్నించారు పోలీసులు. ఆ పోస్టు పెట్టిన 2 నెలలకు జోషి.. సోదరి ఫొటో చూసి గుర్తుపట్టాడు. వెంటనే సోదరిని కలిసేందుకు కర్ణాటక పోలీసులను ఆశ్రయించాడు. ఎప్పటికీ తిరిగి రాదనుకున్న సోదరిని కలిపినందుకు కర్ణాటక పోలీసులకు, మహిళా-శిశు సంక్షేమ అధికారులకు కృతజ్ఞతలు తెలిపాడు.

ఇదీ చదవండి:ఆడుకున్న ఇంటిని కూల్చేశారు.. ఆడించిన నాన్నను చంపేశారు!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details