భారత్- చైనా సరిహద్దు వెంట తూర్పు లద్దాక్‌లో జరిగిన ఘర్షణలో బంగాల్ భీర్బమ్కు చెందిన రాజేశ్ ఓరంగ్ అనే జవాను అమరుడయ్యాడు. కుటుంబంలో ఒకే ఒక్క మగ సంతానం అయిన ఓరంగ్ మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సి ఉంది. అంతలోనే సరిహద్దు ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చైనాపై భారత్ బదులు తీర్చుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
"నా కుమారుడు దేశానికి సేవ చేశాడు. అందులోనే ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు ఎంతో గర్వంగా ఉంది."
-సుభాష్ ఓరంగ్, రాజేశ్ తండ్రి
భీర్బమ్ జిల్లా బెల్గారియాకు చెందిన 25 ఏళ్ల రాజేశ్ ఓరంగ్ 2015లో బిహార్ రెజిమెంట్‌లో జవాన్‌గా చేరాడు. గత జనవరిలో గ్రామానికి వెళ్లాడు. చైనాపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని అభిప్రాయపడింది రాజేశ్ చెల్లి.