తమిళనాడు సాలెం జిల్లా ఆసుపత్రిలో ఓ యువతి వీరంగం సృష్టించింది. హాస్పిటల్లో వసతులు సరిగ్గా లేవని సిబ్బందిపై విరుచుకుపడింది.. కిటికీ ఎక్కి కూర్చుంది.
హాస్పిటల్ కిటికీ ఎక్కి కూర్చుంది.. ఎంతకూ దిగిరానంది! బంగాల్ కోల్‌కతాకు చెందిన ఎల్సికా బెనర్జీ.. బెంగళూరులో చదువుకుంటోంది. గత కొన్ని వారాలుగా తమిళనాడు సాలెం జిల్లా ఓమలూర్ వీధుల్లో తిరుగుతూ కనిపించిన ఆమెను.. పోలీసులు ఓ హాస్టల్లో చేర్చారు. అయితే, హాస్టల్లో ఆమెతో కలిసి ఉంటున్న మరో యువతి జుట్టు కత్తిరించిందని ఎల్సికాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది వార్డెన్.
దీంతో ఆమెను సాలెం జిల్లా ఆసుపత్రిలో చేర్చారు పోలీసులు. ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సదుపాయలు లేవని.. మంచాలు కుంగిపోయి ఉన్నాయని సిబ్బందిపై విరుచుకుపడింది ఎల్సికా. వెంటనే ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను పిలిపించాలని పట్టుపట్టింది. వైద్యులను నోటికి వచ్చినట్టు తిట్టింది. మంచం కంటే కిటికీలే శుభ్రంగా ఉన్నాయంటూ కిటీకీ పైకి ఎక్కి కూర్చుంది.
పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది రెండు గంటలపాటు బతిమాలినా దిగిరాకపోయేసరికి.. ఎల్సికా కాళ్లుచేతులు కట్టేసి.. మత్తు ఇంజక్షన్ ఇచ్చారు వైద్యులు.
ఇదీ చదవండి:ఆస్తి కోసం బాబాయిని నడిరోడ్డుపై నరికేశారు!