2019లో చివరి సంపూర్ణ సూర్యగ్రహణం దేశప్రజలకు కనువిందు చేసింది. అత్యంత అరుదైన రింగ్ ఆఫ్ ఫైర్.. కేరళ, తమిళనాడులో ఆవిష్కృతమైంది. ఉదయం 8 గంటల 4 నిమిషాలకు ప్రారంభమైన సూర్య గ్రహణాన్ని తిలకించేందుకు ప్రజలు ఆసక్తి కనబరిచారు.
ఆకాశంలో అద్భుతం.. ఉంగరంలా మెరిసిన సూర్యుడు - భారత్లో సూర్యగ్రహణం
అత్యంత ఆసక్తికర ఖగోళ పరిణామాల్లో ఒకటైన సూర్యగ్రహణం దేశప్రజలకు కనువిందు చేసింది. అత్యంత అరుదుగా కనిపించే ఉంగరం లాంటి ఆకారంలో సూర్యుడు కనిపించాడు.

ఆకాశంలో అద్భుతం
ఆకాశంలో అద్భుతం
సూర్యగ్రహణం కారణంగా ఉదయమే ఆలయాలను మూసివేశారు. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత తెరిచే అవకాశం ఉంది.
సూర్యగ్రహణం సమయంలో సూర్యుడిని నేరుగా చూస్తే అతినీలలోహిత కిరణాలు కంటి రెటీనాను నష్టపరుస్తాయి. వీటి బారిన పడకుండా గ్రహణాన్ని చూసే సమయంలో ప్రత్యేకంగా తయారు చేసిన సోలార్ ఫిల్టర్లను వినియోగించాలని శాస్త్రవేత్తలు ముందుగానే సూచించారు.