గుజరాత్, జామ్ నగర్ జిల్లాలోని కామధేను దివ్య ఔషధి మహిళా సహకార మండలి సభ్యులు.. చేతుల్లో కరోనాను ఖతం చేసేందుకు 'గోమూత్రం శానిటైజర్' తయారు చేస్తున్నారు. ఆల్కాహాల్, ఇతర రసాయనాలతో తయారైన శానిటైజర్లు కరోనా నుంచి కాపాడతాయేమో కానీ, చర్మానికి మాత్రం తీరని హాని కలిగిస్తాయని.. అందుకే గోమూత్రం శానిటైజర్ తయారు చేస్తున్నామని తెలిపారు.
గోమూత్రం శానిటైజర్ తయారీ గురించి మండలి అధ్యక్షురాలు కల్పనాబెన్ ఈటీవీ భారత్ తో పంచుకున్నారు..
'మా మండలిలో సుమారు 250 మంది మహిళా సహకారులున్నారు. గోమూత్రం నుంచి ఈ మహిళలు ఎరువులు, కీటకనాశినిలను తయారు చేస్తారు. ఇప్పుడు శానిటైజర్ తయారీకి పూనుకున్నాం. ఈ శానిటైజర్లో వేప, తులసి వంటి ఆయుర్వేద గుణాలున్న ఆకులను వినియోగిస్తున్నాం. మార్కెట్లో లభిస్తున్న శానిటైజర్లకంటే.. సహజసిద్ధ పదార్థాలతో తయారయ్యే గోమూత్రం శానిటైజర్ ఎన్నో రెట్లు సురక్షితమైనది. "