పెంపుడు శునకంపై ఉన్న అతి ప్రేమ ఓ యువతిని ప్రాణాలు తీసుకునేలా చేసింది. తన పెంపుడు శునకం మరణించిన వార్త జీర్ణించుకోలేక ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్ జిల్లాలో జరిగింది.
రాయ్‌ఘడ్ జిల్లాకు చెందిన ప్రియాంశు సింగ్(21) పీజీ చదువుతోంది. మంగళవారం రాత్రి తన పెంపుడు శునకం మరణించడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. శునకాన్ని ఖననం చేసిన ఆ తర్వాతి రోజు ఉదయాన్నే ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని కోట్ర పోలీస్‌స్టేషన్ అధికారి చమన్ సిన్హా తెలిపారు.