పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కారుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబరును తన వాహనానికి తగిలించుకొన్న ఒక మహిళపై కేసు నమోదు చేసినట్లు ముంబయి పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ ఉల్లంఘనల ఆరోపణలపై రతన్ టాటా కారు పేరు మీద ఉన్న ఎలక్ట్రానిక్ జరిమానా రశీదలు, ఈ-చలానాలను సదరు మహిళ పేరు మీదుకు బదిలీ చేసినట్లు చెప్పారు.
రతన్ టాటా కారు నెంబరుతో మహిళ హల్చల్ - రతన్ టాటా కారు నెంబరు ప్లేటను తన కారుకు తగిలించుకున్న మహిళ అరెస్టు
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కారు నెంబర్ ప్లేటునే తన కారుకు తగిలించుకుందా మహిళ. సీసీటీవీల సాయంతో ఆ వాహనం జాడను పోలీసులు గుర్తించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలో ఆరోపణలపై రతన్ టాటా కారు పేరు మీద ఉన్న జరిమానాలను ఆమె పేరు మీదకు మార్చారు.
రతన్ టాటా కారు నెంబరుతో మహిళ హల్చల్
సంఖ్యా శాస్త్రానిక సంబంధించిన కారణాల వల్ల ఆమె తన కారు నెంబరును మార్చకున్నట్లు తెలిపారు. అది రతన్ టాటా వాహనానిక సంబంధించిందన్న విషయం ఆమెకు తెలియదన్నారు. ఈ బోగస్ నెంబర్ ప్లేటు గురించి ట్రాఫిక్ పోలీసులకు ఇటీవల ఒక ఫిర్యాదు అందింది. సీసీటీవీల సాయంతో ఆ వాహనం జాడను వారు. పట్టుకున్నారు.
ఇదీ చూడండి:రతన్ టాటా అందుకే అంత ప్రత్యేకం!