తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆహా 'రామస్సెరీ ఇడ్లీ' రుచి.. అనరా మైమరచి! - రామస్సెరీ ఇడ్లీ తెలుగు కథనాలు

హోటల్​కు వెళితే వంద రకాల ఇడ్లీలు దొరుకుతాయేమో కానీ... రామస్సెరీ ఇడ్లీలు మాత్రం ఏ రెస్టారెంటులోనూ దొరకవు. వీటి రుచి చూడాలంటే కేరళ వెళ్లాల్సిందే. అంత దూరం వెళ్లి తినాల్సినంత ప్రత్యేకత అందులో ఏముందనుకుంటున్నారా? ఇదిగో ఈ కథనం చదివితే మీకే తెలుస్తుంది.

A Village Name Tagged With Their Unique Idly In Kerala palakakd  ramassery idly
ఆహా 'రామస్సెరీ ఇడ్లీ' రుచి.. అనరా మైమరచి!

By

Published : Dec 10, 2019, 7:02 AM IST

ఆహా 'రామస్సెరీ ఇడ్లీ' రుచి.. అనరా మైమరచి!

దక్షిణాదిలో ఇడ్లీకి ఉన్న క్రేజే వేరు. వాటిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో ప్రత్యేకతతో చేస్తారు. కేరళ వాసులను అడిగితే మాత్రం 'రామస్సెరీ ఇడ్లీ'కి సాటే లేదంటారు.

కేరళ పాలక్కడలోని రామస్సెరీ గ్రామానికి ఇడ్లీతోనే పేరొచ్చింది. ఈ ఊరిలో భాగ్యలక్ష్మమ్మ కుటుంబం ఇంట్లోనే పువ్వుల్లాంటి ఇడ్లీలు తయారు చేస్తోంది. అయితే.. సాధారణ ఇడ్లీ పాత్రల్లో కాక.... ప్రత్యేకమైన మట్టి పాత్రల్లో ఆవిరిపట్టిస్తారు.

ఇక్కడ ఒక్కో ఇడ్లీ.. దాదాపు ఓ ఊతప్పం అంత పరిమాణంలో ఉంటుంది. అందుకే రెండు ఇడ్లీలు తింటేనే కడుపు నిండిపోతుంది. కట్టెల పొయ్యిపై అప్పటికప్పుడు చేసి.., తోడుగా సాంబారు, పల్లీల చట్నీ, అల్లం చట్నీ, కరివేపాకు పొడి వేసి ఇస్తే లొట్టలేసుకు తినేస్తారు కస్టమర్లు. అందుకే ఈ పల్లెటూరి ఇడ్లీ ఘుమఘుమలు పొలిమేర దాటిపోయి పొరుగూరి ఆహరప్రియులను ఇట్టే ఆకర్షిస్తున్నాయి.

ఇలా మొదలైంది..

ఈ ప్రత్యేక ఇడ్లీలకు మూలాలు తమిళనాడులో ఉన్నాయి. ఆ రాష్ట్రంలోని ముదలియర్​ సామాజికవర్గానికి చెందినవారు ఈ ఇడ్లీలు తయారు చేసేవారు. క్రమంగా ఆ వంటకం కేరళ చేరింది.

భాగ్యలక్ష్మమ్మది చేనేత కుటుంబం. విదేశీ దుస్తులు వచ్చి భారతీయ చేనేత పరిశ్రమ పడిపోయాక పొట్టకూటి కోసం ఇడ్లీల వ్యాపారం ప్రారంభించారు. రుచి, నాణ్యత, స్వచ్ఛత కలగలపి ఇంట్లోనే వండి రామస్సెరీవాసుల కడుపు నింపుతున్నారు.

క్రమంగా ఆ గ్రామం కమ్మని ఇడ్లీలకు చిరునామాగా మారింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ ఇడ్లీలను ఆరగించి వెళుతుంటారు సందర్శకులు. ఇప్పుడు వ్యాపారం విస్తరించి ఓ గదినే హోటల్​గా మార్చింది భాగ్యలక్ష్మమ్మ.

ఇదీ చదవండి:ఎన్​కౌంటర్​ గురించి అనుమానాలున్నాయా...?

ABOUT THE AUTHOR

...view details