తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వలస తల్లి కుమారుడికి 'సూట్​కేస్​' రథమైంది! - lockdown updates in telugu

అలసిసొలిసిన తనయుడి కోసం సూట్​కేసునే రథంగా మార్చింది ఓ తల్లి. లాక్​డౌన్​ వేళ వలస వెతలు తాళలేక స్వగ్రామానికి చేరాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో వందల కిలోమీటర్లు నడిచింది. ఉత్తర్​ప్రదేశ్​లో కెమెరాకు చిక్కిన ఈ దృశ్యం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

a-video-viral-in-which-mother-carrying-her-son-on-suitcase-in-agra
వలస తల్లి కుమారుడికి 'సూట్​కేస్​' రథమైంది!

By

Published : May 15, 2020, 12:29 PM IST

Updated : May 15, 2020, 12:52 PM IST

'అమ్మా నడిచి నడిచి నా చిన్ని కాళ్లు నొప్పిగా ఉన్నాయి.. ఆకలి కూడా వేస్తోంది.. నేనింక నడవలేనమ్మా' అని బిక్కమొహం వేసుకుని కోరిన కుమారుడిని బరువెక్కిన గుండెకు హత్తుకుంది ఓ వలస తల్లి. ఏదేమైనా త్వరగా సొంతగూటికి చేరేందుకే పూనుకుంది. ఉత్తర్​ప్రదేశ్​లో సూట్​కేసుపై ఎనిమిదేళ్ల చిన్నారిని పడుకోబెట్టి.. శక్తినంతా కూడగట్టి లాగింది.

వలస తల్లి కుమారుడికి 'సూట్​కేస్​' రథమైంది!

ఝాన్సీ జిల్లా మహోబాకు చెందిన రమావతి ఉపాధి కోసం పంజాబ్​కు వలస వెళ్లింది. లాక్​డౌన్​ కారణంగా ఉపాధి కోల్పోయి చేతిలో చిల్లిగవ్వ లేకుండాపోయింది. దీంతో తమ బృందంతో కలిసి సొంతూరికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. ప్రభుత్వాలు రైళ్లు, బస్సులు ఏర్పాటు చేశాయనే సమాచారం లేక ఎనిమిదేళ్ల కుమారుడితో కాలినడకన ప్రయాణం మొదలు పెట్టింది.

మండుటెండలో సెగలుగక్కుతున్న రోడ్లపై నడిచి అలసిపోయాడు చిన్నారి. దీంతో సామాన్లు పెట్టుకున్న సూట్​కేస్​కు ఓ తాడు కట్టింది రమావతి. సూట్​కేస్​పై తనయుడిని పడుకోబెట్టి, దానిని లాగుతూ తోటి వారితో సమానంగా నడవసాగింది. వలస కష్టాలకు ఆయాసపడుతూనే.. అమ్మతనాన్ని చాటిన రమావతి వీడియో ఇప్పుడు వైరల్​ అయ్యింది.

ఇదీ చదవండి:బిడ్డను ఒడిలో మోస్తూ ఓ తల్లి సాహసం!

Last Updated : May 15, 2020, 12:52 PM IST

ABOUT THE AUTHOR

...view details