తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాలువలో వ్యాన్​ బోల్తా.. ఏడుగురు చిన్నారులు గల్లంతు

ఉత్తరప్రదేశ్ లక్నో సమీపంలోని నాగ్రమ్ పీఎస్​ పరిధిలో కాలువలో వ్యాన్​ బోల్తాపడి ఏడుగురు చిన్నారులు గల్లంతయ్యారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ అధికారులను ఆదేశించారు.

By

Published : Jun 20, 2019, 1:53 PM IST

కాలువలో వ్యాన్​ బోల్తాపడి ఏడుగురు చిన్నారులు గల్లంతు

కాలువలో వ్యాన్​ బోల్తాపడి ఏడుగురు చిన్నారులు గల్లంతు

ఉత్తరప్రదేశ్ లక్నోలోని​ నాగ్రమ్ పీఎస్​ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. 29 మందితో ప్రయాణిస్తున్న వాహనం స్థానిక ఇందిరా కాలువలో బోల్తాపడింది. ఈ ఘటనలో ఏడుగురు చిన్నారులు గల్లంతయ్యారు. మరో 22 మందిని రక్షించామని తెలిపారు జిల్లా మేజిస్ట్రేట్​ కౌశల్​ రాజ్​ శర్మ.

బారాబంకీ జిల్లాలో పెళ్లి వేడుకలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై స్పందించిన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఎన్​డీఆర్​ఎఫ్​, ఎస్​డీఆర్​ఎఫ్​లు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. చిన్నారుల కోసం గాలింపు కొనసాగుతోంది. ప్రమాద కారణాలపై దర్యాప్తు జరుగుతోంది అని తెలిపారు జిల్లా మేజిస్ట్రేట్​.

" ప్రమాదంలో సుమారు 5 నుంచి 10 ఏళ్లలోపు చిన్నారులు ఏడుగురు గల్లంతయ్యారు. కాలువలో ప్రవాహం అధికంగా ఉండడం వల్ల వారు కొట్టుకొనిపోయి ఉండవచ్చు. ప్రస్తుతం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి."
- కౌశల్​రాజ్​ శర్మ, లఖ్​నవూ జిల్లా మేజిస్ట్రేట్

ఇదీ చూడండి: నిర్లక్ష్యంతో ఇలా రైలు కింద పడ్డాడు

ABOUT THE AUTHOR

...view details