ప్రేమలో విజయం సాధిస్తే ప్రేమికులు పొందే ఆనందమే వేరు. అదే విఫలమైతే మాత్రం ఆ బాధ వర్ణనాతీతం. కర్ణాటకలో మూడేళ్ల పాటు సాగిన ఓ ప్రేమకథ చివరకు విషాదాంతమైంది. ప్రేయసి చావుబుతుకుల్లో ఉంది. ప్రేమికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
విషాద ప్రేమకథ...
ప్రేమలో విజయం సాధిస్తే ప్రేమికులు పొందే ఆనందమే వేరు. అదే విఫలమైతే మాత్రం ఆ బాధ వర్ణనాతీతం. కర్ణాటకలో మూడేళ్ల పాటు సాగిన ఓ ప్రేమకథ చివరకు విషాదాంతమైంది. ప్రేయసి చావుబుతుకుల్లో ఉంది. ప్రేమికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
విషాద ప్రేమకథ...
కర్ణాటక మాండ్య జిల్లాకు చెందిన రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడాకారుడు గిరీశ్. అదే ప్రాంతానికి చెందిన నిత్యశ్రీతో ప్రేమలో పడ్డాడు. ఇద్దరు దాదాపు మూడేళ్ల పాటు ప్రేమించుకున్నారు. తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో తెలియజేశారు. ఇరు కుటుంబాలు పెళ్లికి నిరాకరించాయి. దీంతో పారిపోయి పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇంటి నుంచి వెళ్లిపోయారు. వీరి జాడను నిత్యశ్రీ బంధువు ఒకరు తెలుసుకున్నారు. ఇద్దరికీ తాను పెళ్లి జరిపిస్తానని నమ్మబుచ్చాడు. అతని మాటలు నమ్మి గిరీశ్, నిత్యశ్రీ ఇళ్లకు తిరిగి వెళ్లిపోయారు.
కొద్ది రోజులు గడిచాయి. నిత్యశ్రీ మనసు మార్చారు కుటుంబ సభ్యులు. వేరే వ్యక్తితో పెళ్లికి ఒప్పించారు. ఈ విషయం తెలుసుకున్న గిరీశ్ ఆవేశంతో రగిలిపోయాడు. తనను కాదని మరొకరిని వివాహం చేసుకోబోతున్న ప్రేయసిని హత్య చేయాలనుకున్నాడు. నిత్య శ్రీ ఇంటి వద్దకు వెళ్లి వేచి చూసి, ఆమె బయటకు రాగానే కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. అనంతరం తాను విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రస్తుతం నిత్యశ్రీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తీవ్రగాయాలపాలై ప్రాణాలతో పోరాడుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.