హరియాణాలో ఎన్నికల హడావిడి తారస్థాయికి చేరుకుంది. అగ్రనేతల ప్రచారాలు జోరందుకున్నాయి. ఈసారి ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 90 సీట్లు ఉండగా.. 1,168 మంది బరిలో నిలిచారు. సోమవారం (అక్టోబర్ 7)తో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్యను ఎన్నికల సంఘం వెల్లడించింది. హిసర్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 118 మంది పోటీపడుతుండగా.. పంచుకుల నుంచి అత్యల్పంగా 24 మంది బరిలో ఉన్నట్లు పేర్కొంది.
ఉన్నవి 90 సీట్లు.. బరిలో 1,168 మంది అభ్యర్థులు!
హరియాణాలో 90 అసెంబ్లీ స్థానాలకు ఏకంగా 1,168 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరంతా అక్టోబర్ 21న జరగనున్న ఎన్నికల్లో తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు.
ఉన్నవి 90 సీట్లు.. బరిలో 1,168 మంది అభ్యర్థులు!
పోటీలో నిలిచిన అభ్యర్థులకు ఎన్నికల గుర్తులను కేటాయించినట్లు సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి ఇంద్రజిత్ తెలిపారు. అక్టోబర్ 21న హరియాణా అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అదే నెల 24న ఫలితాలు వెలువడతాయి.
ఇదీ చూడండి: ఎస్బీఐ డెబిట్ కార్డులపై ఇక ఈఎంఐ సౌకర్యం