తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భవనం కూలిన ఘటనలో 10 మంది మృతి.. మోదీ విచారం - bhivandi building collapse news

A three-storied building collapses in Patel Compound area in Bhiwandi, Thane
కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం

By

Published : Sep 21, 2020, 6:25 AM IST

Updated : Sep 21, 2020, 12:12 PM IST

12:05 September 21

మహారాష్ట్రలో ఠానె జిల్లా భివండీలోని పటెల్ కాంపౌండ్​లో  మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు చిన్నారులు సహా 10మంది మరణించారు. శిథిలాల కింద చిక్కుకున్న దాదాపు 30మందిని  సహాయక సిబ్బంది కాపాడారు. ఇంకా కొంత మంది శిథిలాల కిందే ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు.

11:03 September 21

మూడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనపై రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ దిగ్భ్రాంతి చెందారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు.  బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

10:25 September 21

మహారాష్ట్రలో భవనం కూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్ చేశారు.

08:37 September 21

కుప్పకూలిన మూడంతస్తుల భవనం

మహారాష్ట్రలో భివండీలో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 3:40 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సాహాయక బృందాలు చర్యలు కొనసాగిస్తున్నాయి.

06:54 September 21

మూడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

06:40 September 21

06:22 September 21

భవనం కూలిన ఘటనలో 10 మంది మృతి.. మోదీ విచారం

కుప్పకూలిన మూడంతస్తుల భవనం

మహారాష్ట్ర ఠాణె భివండీలోని పటేల్​ కాంపౌండ్​ ప్రాంతంలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఓ చిన్నారి సహా   శిథిలాల కింద చిక్కుకున్న 20 మందిని కాపాడారు సహాయక సబ్బంది. మరో 25మంది శిథిలాల కింద ఉన్నట్లు సమాచారం. 

Last Updated : Sep 21, 2020, 12:12 PM IST

ABOUT THE AUTHOR

...view details