తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ట్రాక్టర్ ర్యాలీలో హింసపై కీలక ఆధారాలు సేకరణ! - దిల్లీ పోలీసులు

రైతుల ట్రాక్టర్​ ర్యాలీ సందర్భంగా దేశ రాజధాని దిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలపై దర్యాప్తు ముమ్మరం చేశారు దిల్లీ పోలీసులు. ఆధారాల కోసం ఫోరెన్సిక్​ నిపుణులు, క్రైమ్​ బ్రాంచ్​ అధికారులు ఘాజీపుర్​ సరిహద్దును సందర్శించారు. పలు ప్రాంతాల నుంచి నమూనాలు సేకరించారు.

forensic experts
ఘాజీపుర్​ సరిహద్దుకు ఫోరెన్సిక్​ బృందం

By

Published : Jan 29, 2021, 4:53 PM IST

గణతంత్ర దినోత్సవం రోజు చేపట్టిన రైతుల ట్రాక్టర్​ ర్యాలీలో హింసాత్మక ఘటనలపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఇప్పటికే 33 ఎఫ్​ఐఆర్​లు నమోదు చేయగా.. 44 మందికి లుక్​అవుట్​ నోటీసులు జారీ చేశారు.

ఆధారాల సేకరణ..

హింసాత్మక ఘటనలపై ఆధారాల కోసం ఘాజీపుర్​ సరిహద్దుకు ఫోరెన్సిక్​ నిపుణుల బృందం, క్రైమ్​ బ్యాంచ్​ అధికారులు వెళ్లారు. సరిహద్దులోని వివిధ ప్రాంతాల నుంచి నమూనాలు సేకరించారు.

ఆధారాలు సేకరిస్తోన్న ఫోరెన్సిక్​ నిపుణులు

సమాచారం అందించండి..

దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన హింసాత్మక ఘటనలపై ఏవైనా ఆధారాలు, సమాచారం ఉంటే తమకు అందించాలని ప్రజలను కోరారు దిల్లీ పోలీసులు.

"దిల్లీ ఘటనలపై సమాచారం ఉన్న ప్రజలు, మీడియా వ్యక్తులు, తమ ఫోన్లలో, కెమెరాల్లో ఘటనలను బంధించిన వారు ఎవరైనా మాకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నాం. తమ వద్ద ఉన్న ఫోటోలు, వీడియోలను పాత దిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయంలోని రెండో అంతస్తులో రూమ్​ నంబర్​ 215లో ఏ రోజైనా పనివేళల్లో అందించవచ్చు. 8750871237, 011-23490094కు సమాచారం ఇవ్వొచ్చు. kisanandolanriots.26jain2021@gmail.com ఈమెయిల్​ చేయొచ్చు. "

- దిల్లీ పోలీసు విభాగం

ఇదీ చూడండి:సింఘులో మళ్లీ ఉద్రిక్తత- పోలీసుల లాఠీఛార్జి

ABOUT THE AUTHOR

...view details