విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఓ కళాశాల అధ్యాపకుడిని దారుణంగా కొట్టిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాల్కరాన్పుర్లో జరిగింది.
విద్యార్థులే తప్పు చేశారు!
విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఓ కళాశాల అధ్యాపకుడిని దారుణంగా కొట్టిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాల్కరాన్పుర్లో జరిగింది.
విద్యార్థులే తప్పు చేశారు!
ఆదర్శ్ జన్తా కళాశాలలో హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్న సమయంలో.. కొంతమంది అబ్బాయిలు ఉద్దేశపూర్వకంగానో లేదా అనుకోకుండానో అమ్మాయిలపై పడ్డారని, దీనితో ఆ ఉపాధ్యాయుడు జోక్యం చేసుకొని విద్యార్థులను మందలించినట్లు తెలిపారు ప్రయాగ్‌రాజ్ ఎస్పీ. అనంతరం.. విద్యార్థులు వారి బంధువులతో సహా వచ్చి కళాశాలలో గొడవచేశారు. భయంతో ప్రిన్సిపల్ గదిలో దాక్కున్న టీచర్‌ను.. తలుపులు పగులకొట్టి మరీ వచ్చి దాడి చేశారు విద్యార్థులు. పెద్ద కర్రలతో తీవ్రంగా కొట్టారు. ప్రిన్సిపల్ వారి నుంచి ఉపాధ్యాయుడిని రక్షించి, ఆసుపత్రిలో చేర్పించారు.
ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే బాధ్యులను అదుపులోకి తీసుకుంటామని తెలిపారు.
ఇదీ చూడండి:మానవ తప్పిదాలతోనే పెను ముప్పు