తెలంగాణ

telangana

ETV Bharat / bharat

7 వేల మంది బాలికల కాళ్లు కడిగిన ఉపాధ్యాయుడు - నలభై ఏళ్లుగా 7 వేల మంది బాలికల కాళ్లు కడిగిన టీచర్​

గురుదేవోభవ అని ఉపాధ్యాయులను పూజించాలని పెద్దలు చెబుతారు. కానీ.. ఆక్కడ మాత్రం..... ఓ గురువు 41 ఏళ్లుగా బాలికలను పూజిస్తున్నారు. 'ఆడపిల్లలను కాపాడండి, ఆడపిల్లలను చదవించండి' అనే నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు.. నిత్యం కన్యాపూజ నిర్వహిస్తున్నారు.

నలభై ఏళ్లుగా 7 వేల మంది బాలికల కాళ్లు కడిగిన టీచర్​

By

Published : Nov 20, 2019, 7:33 AM IST

నలభై ఏళ్లుగా 7 వేల మంది బాలికల కాళ్లు కడిగిన టీచర్​
మధ్యప్రదేశ్‌ కట్నిలోని లుహార్వారా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు.. 41 ఏళ్లుగా ప్రతి రోజూ కన్యా పూజ నిర్వహిస్తున్నారు. రాజా భయ్యా సోని పాఠశాలలో విద్యాబోధనతో పాటు కన్యాపూజ చేయడాన్ని దినచర్యలో భాగం చేసుకున్నారు. 'బేటీ బచావో- బేటీ పడావో' నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సోనీ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

ప్రతిరోజూ పాఠశాలకు వచ్చే బాలికల కాళ్లను గంగా జలంతో కడిగే రాజ భయ్య... తర్వాత వారికి మిఠాయిలు అందిస్తారు. దుర్గాదేవి తొమ్మిది రూపాలకు నిదర్శనంగా తొమ్మిది మంది బాలికలను పూజిస్తారు. ఆ చిన్నారులకు రుచికరమైన వంటకాలు.., బహుమతులు కూడా అందిస్తారు. స్త్రీ నుంచే సృష్టి పుట్టిందని.., ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ స్త్రీని గౌరవించాలని రాజా భయ్యా సోని సూచిస్తారు.

నవరాత్రుల్లో కన్యాపూజ నిర్వహిస్తారు.

"నేను ప్రతిరోజూ పాఠశాలలో కన్యాపూజ నిర్వహిస్తాను. సమాజంలోని ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలనే ఉద్దేశంతో ఈ పూజ నిర్వహిస్తున్నాను. మహిళలు పూజనీయులు. మహిళలందరినీ గౌరవించాలి." - రాజా భయ్యా సోని, ఉపాధ్యాయుడు

చిన్నారులకు రాజా సోని చేసే పూజను స్థానికులు ఎంతో గౌరవిస్తారు. ఇప్పటివరకు ఆయన.. 7 వేల మందికిపైగా బాలికలకు కన్యాపూజ చేశారు. మహిళా శక్తిని చాటి చెప్పేందుకు సోని చేసిన కృషిని... ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ గుర్తించింది. సోని సేవలపై గ్రామస్తుల నుంచి సమాచారం సేకరించిన తర్వాత రికార్డ్స్‌లో నమోదు చేశారు.

ఇదీ చదవండి:ప్లాస్టిక్‌ వ్యర్థాలతో రోడ్లు .. మధురై మహిళల ఘనత

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details