రాజస్థాన్లో ఓ తాంత్రికుడు పదేళ్ల బాలికతో కలిసి సజీవ దహనమయ్యాడు. మంత్ర తంత్రాల్లో భాగంగానే ఈ దారుణానికి ఒడిగట్టాడని పలువురు భావిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్ మార్టానికి తరలించారు. బఖాసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాడ్మేర్ ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.
తాంత్రికుడిని కిస్తూరాంగా పోలీసులు గుర్తించారు. అతడి నివాసానికి సమీపంలోని ఓ గుంతలో మృతదేహాలను కనుగొన్నారు. పెట్రోల్ బాటిళ్లు, ఇతర సామగ్రిని గుర్తించారు.