కర్ణాటక హుబ్లీలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల కుర్రాడు పవన్ కంతి. చదువు అంటే అతనికి ఎంతో ఆసక్తి. కరోనా మహమ్మారి కారణంగా అతడి చదువు ఆగిపోయింది. పాఠశాల యాజమాన్యం ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నా.. కుటుంబ ఆర్థిక పరిస్థితి, ఊరులో మొబైల్ సిగ్నల్ సమస్యలు అతనికి సహకరించలేదు.
నెలకు సరిపడా హోంవర్క్..
చదువుకోవాలనే సంకల్పంతో తల్లిదండ్రులను ఓ కోరిక కోరాడు పవన్. కుమారుడు అడిగిందే తడవుగా తల్లి పార్వతి.. టీచర్ అనసూయ దగ్గరకు తీసుకెళ్లింది. కుర్రాడి ఆసక్తిని చూసి ఉపాధ్యాయురాలు నెలకు సరిపడా హోం వర్క్‌ను, అందుకు సంబంధించిన పుస్తకాలను ఇచ్చారు. సరిగ్గా నెలరోజుల అంతా పూర్తి చేశాడు. పూర్తి చేసిన వర్క్‌ను టీచర్‌కు చూపించేందుకు 35 కి.మీలు తల్లితో కలిసి ప్రయాణించాడు.