తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈటీవీ భారత్​ 'వైష్టవ జన తో' గీతంపై పంజాబ్​ వర్సిటీ ప్రశంసలు

మహాత్ముని 150వ జయంతి సందర్భంగా ఈటీవీ భారత్​ రూపొందించిన 'వైష్ణవ జన తో'భజన గీతానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందాయి. ఐక్యతను చాటే విధంగా ఈ గీతాన్ని ఈటీవీ భారత్​ చిత్రీకరించిన తీరును తాజాగా పంజాబ్​ యూనివర్సీటీ ప్రొఫెసర్లు, విద్యార్థులు మెచ్చుకున్నారు.

ఈటీవీ భారత్​ 'వైష్టవ జన తో' గీతంపై పంజాబ్​ వర్సిటీ ప్రశంసలు

By

Published : Nov 1, 2019, 6:02 AM IST

Updated : Nov 1, 2019, 7:20 AM IST

ఈటీవీ భారత్​ 'వైష్టవ జన తో' గీతంపై పంజాబ్​ వర్సిటీ ప్రశంసలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయాన ట్వీట్​ ద్వారా ప్రశంసించిన ఈటీవీ భారత్​ 'వైష్టవ జన తో' భజన గీతం ఇప్పుడు పంజాబ్​ యూనివర్సిటీ విద్యార్ధులూ, ప్రొఫెసర్ల గుండెనూ తాకింది.

"ఈ వీడియో అందంగా రూపొందించారు. ఇది దేశ ఐక్యతను చూపిస్తుంది. ఈ పాటను నేను ఇంతకు ముందే విన్నాను, కానీ ఈటీవీ సమర్పించిన విధానం భిన్నమైనది, అద్భుతమైనది. ఈ వీడియోకు లోతైన అర్థం ఉంది. " -అశు పస్రిచా, గాంధేయన్ అధ్యయన విభాగాధిపతి, పంజాబ్​ యూనివర్సిటీ

మహాత్మ గాంధీ 150వ జయంతి సందర్భంగా ఈటీవీ భారత్ రూపొందించిన ఈ గీతాన్ని, రామోజీ గ్రూప్​ సంస్థల ఛైర్మన్​ రామోజీరావు ఆవిష్కరించారు. ప్రముఖ సంగీత దర్శకుడు వాసురావు సాలూరి ఈ గీతానికి సంగీతం సమకూర్చారు. దేశ నలుమూలలు, భిన్న సంస్కృతులు కనిపించేలా అజిత్​ నాగ్ అద్భుతంగా​ చిత్రీకరించారు.

ఈ వీడియోలో భారతదేశం నలుమూల నుంచి వచ్చిన గాయకులున్నారు, మహాత్మా గాంధీకి ఎంతో ఇష్టమైన వైష్ణవ జనతో గీతానికి తమ గాత్రంతో స్వరాలు పలికించారు. మానవత్వం, ప్రేమ, తోటి జీవుల పట్ల శ్రద్ధ గురించి చెప్పిన ఈ భజన గీతం అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది.

"భారత దేశంలో వివిధ భాషల గాయకులు ఈ వీడియోలో కనిపించడం, వివిధ కట్టడాలు, ఈ వీడియో మానవత్వాన్ని ప్రతిబింబించింది." -బ్రిజ్​ మోహన్​, ఈటీవీ భారత్​ పంజాబ్​ అనుసంధానకర్త.

"ఈ వీడియో భారతదేశంలోని వివిధ ప్రదేశాలలో చిత్రీకరించారు. ఈ భజన గాంధీ తత్వాన్ని ఒక ప్రత్యేకమైన రీతిలో సూచిస్తుంది. ఈ వీడియో వైవిధ్యంలో ఐక్యతా సందేశాన్ని ఇస్తుంది"-డాక్టర్ కిరణ్ చౌహాన్, రచయిత.

తమిళం (పీ ఉన్నికృష్ణన్), తెలుగు (ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం), కన్నడం (పీ విజయ్ ప్రకాష్), గుజరాతీ (యోగేశ్ గాధవి), అసోమీ (పులక్ బెనర్జీ), మరాఠీ (వైశాలి మేడ్), మలయాళం (పి.ఎస్. ), బెంగాలీ (హైమంతి సుక్లా), ఒడియా (సుబాష్ చంద్ర దాస్), హిందీ (చన్ను లాల్ మిశ్రా, సలామత్ ఖాన్) వంటి పలు భాషల్లో దేశ పితామహుడికి గొప్ప నివాళి అర్పించిన తీరు అందరినీ కట్టిపడేస్తోంది.

ఇదీ చూడండి:నిర్మలా సీతారామన్ విమర్శలను తిప్పికొట్టిన రాజన్

Last Updated : Nov 1, 2019, 7:20 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details