ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి ఇక్కడే ఒదిగిపోయింది! విదేశీయులు మన దేశానికి వస్తే... కళ్లకు నల్ల కళ్లద్దాలతో దర్శనమిస్తూ 'వావ్ ఇండియా ఎంత బాగుంది' అని చూసి తరిస్తారు. భారత సంసృతి నచ్చిందని మాటల్లో చెప్పడమే కానీ, ఇక్కడ పనులన్నీ ఎంతో ఇష్టంగా నేర్చుకునేవారు ఎంతమంది ఉంటారు? కానీ, థెరిసా మాత్రం అలా కాదు. పుట్టింది పెరిగింది స్పెయిన్ దేశంలోనే అయినా... మన సంస్కృతి నచ్చి, కర్ణాటక సంప్రదాయంలో ఒదిగిపోయింది.
లాక్డౌన్ వల్లే ...
స్పెయిన్కు చెందిన థెరిసా 4 నెలల క్రితం పర్యటకురాలిగా భారత్కు వచ్చింది. ఇంతలో ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. దీంతో కర్ణాటకలో చిక్కుకుపోయిందామె. ఉడుపి, హెరంజల్లోని కృష్ణ పూజారి వారింట్లో ఆశ్రయం పొందింది. రోజూ వారు ఇంట్లో చేసే పనులు, భారతీయ సంస్కృతి థెరిసాకు తెగ నచ్చేశాయి. ఆ కుటుంబ సభ్యులను చూసి తానూ ఆ పనులన్నీ నేర్చుకోవడం మొదలు పెట్టింది.
ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి ఇక్కడే ఒదిగిపోయింది! కుందపుర యాసలో కన్నడ భాష నేర్చుకుని.. గ్రామస్థులతోనూ ఇట్టే కలిసిపోయింది థెరిసా. భారతీయ కట్టుబొట్టు అలవాటు చేసుకుంది. వాకిట్లో ముగ్గులు పెట్టడం, కర్ణాటక వంటకాలు, ఆవు పాలు పితకడం, బురద మడిలో దిగి నారు పెట్టడమే కాదు.. కర్ణాటక అక్షరాలు రాయడం చదవడం పూర్తిగా నేర్చేసుకుంది.
ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి ఇక్కడే ఒదిగిపోయింది! ముంబయిలోని ఓ అమెరికా కంపెనీలో పని చేస్తున్న సమయంలో కృష్ణ పుజారికి పరిచయమయ్యాడు.. థెరిసా సోదరుడు. ఆ పరిచయంతోనే అడగ్గానే ఆమెను ఓ అతిథిగా ఇంటికి తీసుకొచ్చాడు కృష్ణ పూజారి కానీ, ఇప్పుడు ఆమె ఆ కుటుంంబంలో ఒకటిగా కలిసిపోయింది. ఇప్పుడు అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభిస్తే.. థెరిసా తిరిగి స్పెయిన్కు వెళ్లిపోవాల్సి వస్తోంది. కానీ, తనను పంపించడం పూజారి కుటుంబానికి ఏమాత్రం ఇష్టం లేదు. తనకు కూడా భారతదేశాన్ని వదిలివెళ్లాలని లేదంటోంది స్పెయిన్ సుందరి.
ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి ఇక్కడే ఒదిగిపోయింది! ఇదీ చదవండి: 'అమ్మ తాళి తాకట్టు పెట్టి, మా కోసం టీవీ కొనేసింది!'